TDP Mahanadu 2023: టీడీపీ మహానాడులో తొలిరోజు ప్రతినిధుల సభ.. కార్యక్రమాల షెడ్యూల్ ఇలా..

రెండు రోజులు మహానాడులో భాగంగా శనివారం ప్రతినిధుల సభ జరుగుతుంది. మహానాడు నుండి ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ మోగించనుంది. అదేవిధంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారు.

TDP Mahanadu 2023: టీడీపీ మహానాడులో తొలిరోజు ప్రతినిధుల సభ.. కార్యక్రమాల షెడ్యూల్ ఇలా..

TDP Mahanadu 2023

Andhra Pradesh: : రాజమండ్రి వేదికగా పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజులు జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద ఈ పసుపు పండుగను నిర్వహిస్తున్నారు. రెండు రోజులు పాటు ఈ మహానాడు జరుగుతుంది. తొలి రోజు (శనివారం) ప్రతినిధుల సభ జరగనుండగా, రెండో రోజు (ఆదివారం) బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ ఆదివారం సాయంత్రం జరుగుతుంది. ఈ సభకు 15లక్షల మందిని తరలించేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతినిధుల సభకు 15వేల మందికి ఆహ్వానం అందించారు.

TDP Mahanadu 2023: మహానాడుకు సిద్ధమైన రాజమహేంద్రవరం.. పార్టీ ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటించనున్న చంద్రబాబు

మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహానాడు నిర్వహిస్తుండటం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపనుంది. రెండు రోజులు మహానాడులో భాగంగా శనివారం ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో నాలుగు ముఖ్యాంశాలను చంద్రబాబు నాయుడు తీర్మానం చేయనున్నారు. మహానాడు నుండి ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ మోగించనుంది. అదేవిధంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారు. రైతులకు, మహిళలకు, యువకులకు అధిక ప్రయోజనాలు కలిగే విధంగా తొలి మ్యానిఫెస్టోను టీడీపీ విడుదల చేయనుంది.

Chandrababu Naidu : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పాత్ర బహిర్గతమైంది- చంద్రబాబు

తొలిరోజు కార్యక్రమాల షెడ్యూల్ ఇలా..

– ఉదయం 8 గంటల నుండి 10గంటలకు వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం.

– ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్

– 10.30 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభం.

– 10:45కి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రముఖులతో జెండా ఆవిష్కరణ.

– 10.50కి జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి.

– 11 గంటల నుండి 11.30 వరకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ ముఖ్య నేతలచే ప్రసంగాలు, సందేశాలు.

– 11.30 నుండి 12.15 వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభ ఉపన్యాసం.

– మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రముఖుల ప్రసంగాలు.

– మధ్యాహ్నం 2.30 వరకు భోజన విరామం.

– 2.30 నుండి 3 గంటల వరకు తెలంగాణ తీర్మానాలు.

– 3 గంటల నుండి సాయంత్రం 6.30 వరకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖుల ప్రసంగాలు.

– 6.30 నుండి రాత్రి 7 గంటల వరకు రాజకీయ తీర్మానం.

– రాత్రి 7గంటలకు అధ్యక్షులు ఎన్నిక ముగింపు ప్రసంగం ఉంటుంది.

– రాత్రికి సభా ప్రాంగణం వద్దే చంద్రబాబు నాయుడు, లోకేష్ బస చేయనున్నారు.