TDP Mahanadu 2023: మహానాడుకు సిద్ధమైన రాజమహేంద్రవరం.. పార్టీ ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటించనున్న చంద్రబాబు

రాజమహేంద్రవరంలో 1993లో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఆ తరువాత సంవత్సరం 1994 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30ఏళ్ల తరువాత మరోసారి రాజమహేంద్రవరంలో ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించనుంది.

TDP Mahanadu 2023: మహానాడుకు సిద్ధమైన రాజమహేంద్రవరం.. పార్టీ ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటించనున్న చంద్రబాబు

TDP Mahanadu

Andhra pradesh: రాజమండ్రి వేదికగా పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజులు జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద ఈ పసుపు పండుగను నిర్వహిస్తున్నారు. రెండు రోజులు పాటు ఈ మహానాడు జరుగుతుంది. తొలి రోజు (శనివారం) ప్రతినిధుల సభ జరగనుండగా, రెండో రోజు (ఆదివారం) బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ ఆదివారం సాయంత్రం జరుగుతుంది. ఈ సభకు 15 లక్షల మందిని తరలించేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ ప్రధాన వేదికను 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంతో సిద్ధం చేశారు.

TDP Mahanadu : తెలుగుదేశం మహానాడు.. ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు

ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం కావటం, తెలుగుదేశం పార్టీ స్థాపించి 41ఏళ్లు పూర్తవ్వడంతో పాటు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో చరిత్రలో నిలిచిపోయేలా ఈసారి మహానాడును నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ మహానాడు వేదిక నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. అంతేకాదు.. ఈసారి మహానాడులోనే పార్టీ ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటించనుంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశాక చంద్రబాబు నాయుడు తొలిరోజు మహానాడును ప్రారంభిస్తారు.

TDP Mahanadu : తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు పూర్తి.. 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ, 60 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ

ప్రతినిధుల సభకోసం 10 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 15వేల మంది పార్టీ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించారు. మరో 35వేల మంది కార్యకర్తలు రానున్నారు. చంద్రబాబు, లోకేశ్ తో సహా పార్టీ ముఖ్యనేతలు కూర్చునేందుకు 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సభా వేదిక నిర్మించారు. ప్రతినిధుల సభలో ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆమేరకు సభలో తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అదేవిధంగా తెలంగాణవి ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తారు.

TDP Mahanadu : మహానాడుకు రండీ .. చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతినిధులకు ఆహ్వానం

ఇదిలాఉంటే.. రాజమహేంద్రవరంలో 1993లో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఆ తరువాత సంవత్సరం 1994 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి రాజమహేంద్రవరంలోనే ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 30ఏళ్ల సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందని, తద్వారా టీడీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.