Chandrababu – CID : సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో చంద్రబాబు విచారణ

చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అధికారులు విచారించనున్నారు. చంద్రబాబును సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం విచారించనుంది.

Chandrababu – CID : సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో చంద్రబాబు విచారణ

CID Question for Chandrababu

Chandrababu investigation by CID : స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిదని దానికి చంద్రబాబు ప్రధాన సూత్రధాని అనే ఆరోపణలో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కష్టడీ అంశంపై సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పుని రిజర్వ్ చేయటం అనంతరం శుక్రవారం (సెప్టెంబర్ 22) తుది నిర్ణయాన్ని వెలువరించటం జరిగింది. చంద్రబాబుకు షాక్ ఇస్తు  సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు విచారణ కోసం ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరగా కోర్టు మాత్రం రెండు రోజులే ఇచ్చింది.

దీంతో చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అధికారులు విచారించనున్నారు. చంద్రబాబును సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం విచారించనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశించింది. దీంట్లో భాగంగా సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రానున్నారు. దీని కోసం ఇప్పటికే అధికారులు రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌసుకు చేరుకున్నారు. మరికాసేపట్లో జైలుకు చేరుకుని చంద్రబాబును విచారించనున్నారు.

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు ఎవరెవరు సహకరించారు? ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? వంటి కీలక విషయాల గురించి సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దాదాపు వంద ప్రశ్నలు సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కోర్టు ఇచ్చిన ఆదేశాలు..
ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలి.
న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలి..
విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకూడదు..
విచారణకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాకూడదు..
చంద్రబాబు వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి..
చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది..