Chandra Babu : నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్ .. కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం

నంద్యాలలో భూమా అఖిల ప్రియ అరెస్టు..దానికి దారి తీసిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాలలో అసలేం జరిగింది?అనే విషయంపై ఫుల్ డిటైల్స్ కావాలంటే చంద్రబాబు ఆదేశించారు.

Chandra Babu : నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్ .. కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం

Chandrababu serious Nandyala incident

Bhuma Akhila Priya Nandyala incident : నంద్యాలలో భూమా అఖిల ప్రియ అరెస్టు..దానికి దారి తీసిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాలలో అసలేం జరిగింది?అనే విషయంపై ఫుల్ డిటైల్స్ కావాలంటే చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనకు దారి తీసిన వారిపై చర్యలు తప్పవని..పార్టీ నేతలు ఎంతటివారైనా క్రమశిక్షణ పాటించాల్సిందేనన్నారు. క్రమశిక్షణ అతిక్రమిస్తే ఏస్థాయి నేతలపై అయినా చర్యలు తప్పవని నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు చంద్రబాబు.

నంద్యాల ఘటనపై పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తు..పార్టీ సీనియర్లతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కొట్టుకునేంత ఘర్షణ వాతావరణానికి దారితీసిన పరిణామాలపై నివేదిక అందచేయాలన్న ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించనని హెచ్చరించారు.

Andhra Pradesh : ఆళ్లగడ్డలో టెన్షన్ టెన్షన్.. భూమా అఖిలప్రియ అరెస్ట్..

ఈ ఘటన కేవలం పార్టీ నేతల్లో ఏర్పడినది కాదని వైకాపా శ్రేణులుటీడీపీ కార్యక్రమాల్లోకి చొరబడి ఘర్షణ లు పురిగొలిపే చర్యలు కూడా ఉన్నాయని చంద్రబాబు అనుమానాలు వ్యక్తంచేశారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలన్న చంద్రబాబు సూచించారు.

కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రను నంద్యాల నియోజవర్గంలోకి స్వాగతం పలికే సమయంలో కొత్తపల్లి వద్ద అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమం ఇలా ఉద్రిక్తతలకు దారి తీసి అరెస్టుల వరకు వెళ్లింది. ఓవైపు అఖిల ప్రియ వర్గీయులు, మరోవైపు సుబ్బారెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేస్తు ఆ ప్రాంతాన్ని హీటెక్కించారు. ఈ క్రమంలోనే కొంతమంది సడెన్ గా సుబ్బారెడ్డిపై కొంతమంది దాడి చేశారు. ఈ ఘర్షణ జరిగే సమయంలో అఖిల ప్రియ కూడా అక్కడే ఉండటంతో ఆమె వర్గీయులే సుబ్బారెడ్డిపై దాడి చేశారనే కలర్ వచ్చింది. మరి సుబ్బారెడ్డిపై దాడి చేసినవారు అఖిల ప్రియ వర్గీయులేనా? లేదా వైసీపీ శ్రేణులు గుంపులో చొరబడి ఈ ఘర్షణకు కారణమయ్యారా? అనేది తెలియాల్సి ఉంది. చంద్రబాబు అనుమానాలు ఆదిశగానే వ్యక్తంచేస్తున్నారు. సుబ్బారెడ్డికి, అఖిల ప్రియకు మధ్య ఉన్న విభేధాలను..ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఇలా ఉపయోగించుకున్నారా? దీంట్లో వాస్తవం ఎంత? చంద్రబాబు అనుమానాలు ఎంత వరకు వాస్తవం? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Bhuma Akhila Priya : చిన్న పిల్లాడిని ఎత్తుకొని పోలీస్ స్టేషన్‌కొచ్చిన భూమా అఖిల ప్రియ..