Bhuma Akhila Priya : చిన్న పిల్లాడిని ఎత్తుకొని పోలీస్ స్టేషన్‌కొచ్చిన భూమా అఖిల ప్రియ..

అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియ చిన్నపిల్లాడిని ఎత్తుకునే పోలీస్ట్ స్టేషన్ కు వచ్చారు. ఆమెతో పాటు ఆమె భర్త,తమ్ముడు కూడా పీఎస్ కు వచ్చారు.

Bhuma Akhila Priya :  చిన్న పిల్లాడిని ఎత్తుకొని పోలీస్ స్టేషన్‌కొచ్చిన భూమా అఖిల ప్రియ..

Bhuma Akhila Priya IN Panyam PS

Andhra Pradesh : టీడీపీ నేత,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నంద్యాల జిల్లాలోని అరెస్ట్ చేసిన పోలీసులు పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అఖిల ప్రియ చిన్నపిల్లాడిని ఎత్తుకునే పోలీసులతో స్టేషన్ కు వచ్చారు. పాణ్యం పోలీస్ స్టేషన్ కు అఖిలప్రియతో పాటు భర్త భార్గవరామ్, తమ్ముడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి కూడా ఉన్నారు. అఖిల ప్రియ అరెస్ట్ తో అటు నంద్యాలోను..ఆళ్లగడ్డలను టెన్షన్ వాతావరణం నెలకొంది. అఖిల ప్రియ ఇంటికెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని మొదటి నంద్యాల తరలించారు. ఆ తరువాత అక్కడి నుండి పాణ్యం పోలీసు స్టేషన్ కు తరలించారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పాణ్యం తరలించారు. అఖిల ప్రియ మోహన్ తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్ట్ తో నంద్యాలలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.

Andhra Pradesh : ఆళ్లగడ్డలో టెన్షన్ టెన్షన్.. భూమా అఖిలప్రియ అరెస్ట్..

కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నంద్యాల నియోజవర్గంలోకి స్వాగతం పలికే సమయంలో కొత్తపల్లి వద్ద అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమం ఇలా ఉద్రిక్తతలకు దారి తీసి అరెస్టుల వరకు వెళ్లింది. ఓవైపు అఖిల ప్రియ వర్గీయులు, మరోవైపు సుబ్బారెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేస్తు ఆ ప్రాంతాన్ని హీటెక్కించారు. ఈ క్రమంలోనే కొంతమంది సడెన్ గా సుబ్బారెడ్డిపై దాడి చేయగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘర్షణ జరిగే సమయంలో అఖిల ప్రియ కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది.

దీంతో ఆమె  చంటిపిల్లాడిని తీసుకునే పోలీసు స్టేషన్ కు రావటం ఆసక్తికరంగా మారింది. కాగా..అఖిల ప్రియకు 2021 డిసెంబర్ లో మగబిడ్డకు జన్మనిచ్చారు. భూమా అఖిల ప్రియ తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ కొడుకుకి జన్మనిచ్చారు. భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలోనే భార్గవ రామ్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబర్ లో అఖిల భార్గవ్ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడా బిడ్డకు ఏడాది దాటి నాలుగు నెలల వయస్సు.  అఖిల అరెస్ట్ తో పాణ్యం స్టేషన్ కు తరలి వస్తున్నారు ఆమె అనుచరులు.

.