Andhra Pradesh : ఆళ్లగడ్డలో టెన్షన్ టెన్షన్.. భూమా అఖిలప్రియ అరెస్ట్..
నంద్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసులు అఖిల ప్రియను అరెస్ట్ చేసి పాణ్యం తరలిస్తున్నారు. అఖిల ప్రియ మోహన్ తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్ట్ తో నంద్యాలలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.

Bhuma Akhila Priya
Bhuma akhila priya : నంద్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసులు అఖిల ప్రియను అరెస్ట్ చేసి పాణ్యం తరలిస్తున్నారు. అఖిల ప్రియ PA మోహన్ తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్ట్ తో నంద్యాలలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.
మంగళవారం (మే16,2023) కొత్తపల్లి వద్ద అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. దీంతో సుబ్బారెడ్డికి గాయాలు కావటంతో ఈరోజు అఖిల ప్రియతో పాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని నంద్యాల పీఎస్ కు తరలిస్తారని అనుకున్న పోలీసులు మరి ఏం జరిగిందోగానీ తరువాత పాణ్యం తరలించే యత్నాలు చేశారు. కానీ కాసేపటికే ఓర్వకల్లు తరలించాలని అనుకున్నారు. ఈ తరలింపు ఎక్కడికి అనేది క్లారిటీ లేకపోవటంతో అఖిలప్రియనుఆమె అనుచరులను ఎక్కడకు తరలిస్తున్నారు? అనేదానిపై ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. నంద్యాల టీడీపీలో మొదలైన అంతర్యుద్ధం అరెస్టుల వరకు వెళ్లింది. అఖిల ప్రియను ఆమె అనుచరులను అరెస్ట్ చేయటంతో స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతోపాటు భార్గవ్ రామ్, పీఏ మోహన్‌కు కూడా అదుపులోకి తీసుకుని ఎక్కడికి తరలించాలో కూడా క్లారిటీ లేకుండా అటు ఇటు తిప్పుతున్నారు.
కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మద్య ఎంతో కాలంనుంచి వర్గపోరు కొనసాగుతోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. భూమా అఖిల ప్రియ తండ్రి నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. నాగిరెడ్డి మరణం తరువాత ఈ వాతావరణం అంతా మారిపోయింది. వర్గాలుగా విడిపోయి విమర్శలు..ప్రతి విమర్శలతో వర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. అది అంతకంతకు పెరుగుతోంది. కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు అంతకంతకకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి తప్ప ఏమాత్రం తగ్గటంలేదు. ఈక్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ అగ్రనేత లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుండగా ఈ రెండు వర్గాల మధ్యా విభేధాలు రచ్చకెక్కాయి. కొట్టుకునేవరకు వెళ్ళాయి.
భూమా అఖిల ప్రియ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఏవీ సుబ్బారెడ్డిపై తిరగబడ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డికి గాయాలు కావటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే ఇలా జరగడం టిడీపీ వర్గాల్లో గందరగోళం నెలకొంది.
కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రను నంద్యాల నియోజవర్గంలోకి స్వాగతం పలికే సమయంలో కొత్తపల్లి వద్ద అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమం ఇలా ఉద్రిక్తతలకు దారి తీసి అరెస్టుల వరకు వెళ్లింది. ఓవైపు అఖిల ప్రియ వర్గీయులు, మరోవైపు సుబ్బారెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేస్తు ఆ ప్రాంతాన్ని హీటెక్కించారు. ఈ క్రమంలోనే కొంతమంది సడెన్ గా సుబ్బారెడ్డిపై దాడి చేయగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘర్షణ జరిగే సమయంలో అఖిల ప్రియ కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది.