Chandrababu Amaravathi : ఎంతో ఆలోచించి సీఆర్డీయే చట్టం తెచ్చాం- హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం

ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారనే ఆనాడు ఎంతో ఆలోచించి సీఆర్డీయే చట్టం తీసుకొచ్చాం. భూములు ఇచ్చిన రైతులకు పక్కాగా హక్కులు కల్పించాం.

Chandrababu Amaravathi : ఎంతో ఆలోచించి సీఆర్డీయే చట్టం తెచ్చాం- హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం

Chandrababu Amaravathi

Chandrababu Amaravathi : ఏపీ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలో సర్పంచ్ ల అవగాహన సదస్సులో మాట్లాడిన చంద్రబాబు.. హైకోర్టు తీర్పుని ప్రజా విజయంగా అభివర్ణించారు. ఇవాళ అమరావతి రైతులు సాధించిన ఈ విజయం రాష్ట్ర ప్రజలందరిదీ అన్న ఆయన రైతులకు, రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. అమరావతిలో ఒక కులం, ఒక మతం, ఒక వర్గం అని కాకుండా అందరూ ఉన్నారని చంద్రబాబు(Chandrababu Amaravathi) తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని వెల్లడించారు.

“పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చేది భూమి. భూమి అంటే మనవాళ్లకు ఎంతో సెంటిమెంట్. అలాంటిది 33 వేల ఎకరాల భూములు ఎలాంటి వివాదాలు లేకుండా ఇచ్చారు. రాజధాని శంకుస్థాపనకు సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చారు. సింగపూర్, జపాన్ వంటి దేశాల నుంచి మంత్రులు వచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి సీఎంలు, గవర్నర్లు వచ్చారు. అందరి ఆశీస్సులతో భూమి పూజ చేస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాటకు తెరలేపింది.

గత రెండేళ్లుగా వరదలు వస్తున్నాయి. అమరావతిలో ఎక్కడైనా ఒక్క ఎకరం ముంపుకు గురైందా? కానీ ఇది వరద ముంపునకు గురయ్యే భూమి అని లేనిపోని మాటలు అన్నారు. ఇది స్మశానం అన్నారు, ఎడారి అన్నారు. కృష్ణా నది పారే పట్టిసీమ పక్కనే ఉన్న ప్రాంతాన్ని ఈ విధంగా అనడం బాధాకరం. ఇక్కడి భూమి పునాదులు వేసేందుకు అనువుగా లేదన్నారు. దాంతో, మద్రాస్ ఐఐటీ నిపుణులు చెన్నై కంటే, హైదరాబాద్ కంటే పునాదులకు అమరావతి భూమే గట్టిదని చెప్పారు. ఇలాంటివి చాలా జరిగాయి.

Minister Botsa : సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు- హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స

ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారనే ఆనాడు ఎంతో ఆలోచించి సీఆర్డీయే చట్టం తీసుకొచ్చాం. భూములు ఇచ్చిన రైతులకు పక్కాగా హక్కులు కల్పించాం. రాజధాని కోసం 807 రోజులుగా రైతాంగం దీక్ష చేస్తోంది. రైతులను, మహిళలను కొట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారు పోరాడి విజయం సాధించారు. ఈ ప్రభుత్వం మూడేళ్లు ఇష్టం వచ్చినట్టు పరిపాలించింది. ఇక రెండేళ్లే మిగిలుంది. చేయడానికి కూడా ఏమీ లేదు. కానీ ఇప్పటివరకు చేసిన దానికి చరిత్రహీనులుగా చిరస్థాయిగా మిగిలిపోతారు” అని నిప్పులు చెరిగారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది.

Chandrababu On AP High Court Verdict Over AP Capital Amaravathi

Chandrababu On AP High Court Verdict Over AP Capital Amaravathi

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని సర్కారుకు తేల్చి చెప్పింది.

Konidela Nagababu : ఇప్పటికైనా ప్రజల రాజధాని నిర్మించాలి, ప్రజలతో శత్రుత్వం వద్దు- నాగబాబు

రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు ఆ భూములను తాకట్టు పెట్టరాదని స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందిగా సర్కారును కోర్టు ఆదేశించింది.