Chandrababu Naidu: జనం బాట.. రేపు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని టీడీపీ ఇప్పటికే నిరనలు చేపడుతుంది. ఈ క్రమంలో ఆ పార్టీ

Chandrababu Naidu: జనం బాట.. రేపు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu

Chandrababu Naidu: ఏపీలో ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని టీడీపీ ఇప్పటికే నిరనలు చేపడుతుంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘బాదుడే బాదడు’ పేరుతో నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో రేపటి నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను టీడీపీ విడుదల చేసింది. రేపు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తారు. 5న భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో, 6న ముమ్మడివరం నియోజకవర్గం కోరింగ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొని వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు.

Chandrababu Naidu: రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ పై డీజీపీకి లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ఇలా..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఆముదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం దుల్లవలస గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తారు. బుబు పర్యటనలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్ ఛార్జి, జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ తెలిపారు. పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం 4గంటల నుండి 6గంటల వరకు గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు తదితర అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చంద్రబాబు వివరించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు గ్రామ సభలో పాల్గొని ప్రజలతో మాట్లాడుతారు. అనంతరం గ్రామంలోని బడుగు, బలహీన వర్గాలతో కలిసి చంద్రబాబు సహపంక్తి భోజనం చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు.