Chandrababu : ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ

టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.

Chandrababu : ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ

Chandrababu Delhi Tour

Chandrababu Delhi Tour : టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం అయ్యారు. హస్తినలోని అమిత్ షా నివాసంలో 50 నిముషాల పాటు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం కొనసాగింది. ఏపీ, తెలంగాణ సహా జాతీయ రాజకీయ అంశాలు, పొత్తులపై జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. పొత్తులు, ఎన్డీఏలో భాగస్వామ్యంపై ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం.

భవిష్యత్ లో మరిన్ని సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ రానుంది. టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.

Chandrababu – Amit Shah : అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం.. ఐదేళ్ల తర్వాత బీజేపీ నేతలతో తొలిసారి భేటీ

కాగా, ఐదేళ్ల తర్వాత బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్.. ఏపీలో పోటీ చేస్తుంది కాబట్టి కలిసి వెళ్తే రెండు రాష్ట్రాల్లో ప్రయోజనం ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, విపక్షాల ఐక్యత కసరత్తు నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.