Mother Children Suicide: చినగంజాంలో బిడ్డలతో సహా తల్లి బలవన్మరణం, మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద..బిడ్డలతో సహా తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతుల వివరాలను పోలీసులు సేకరించారు.

Mother Children Suicide: చినగంజాంలో బిడ్డలతో సహా తల్లి బలవన్మరణం, మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు

Crimeq

Updated On : February 9, 2022 / 8:06 PM IST

Mother Children Suicide: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద..బిడ్డలతో సహా తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతుల వివరాలను పోలీసులు సేకరించారు. మంగళవారం జరిగిన ఈఘటనలో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న చినగంజాం పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల వివరాలు తెలుసుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే ఎంత విచారించినా మృతుల వివరాలు లభించలేదు. ఇదిలాఉంటే బుధవారం మధ్యాహ్నం మృతుల వివరాలు లభించాయని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. మృతులు చినగంజాం మండలం కుక్కలవారిపాలెంకు చెందిన పేరంపల్లి కళ్యాణి( 32), నందినీ రెడ్డి (5), వెంకట్ అవినాష్ రెడ్డి(4)లుగా పోలీసులు గుర్తించారు.

Also read: Rail Projects in AP: ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదు: కేంద్ర మంత్రి

పోలీసులు తెలిపిన వివరాలు మేరకు దర్శి మండలం చౌటుపాలెంకు చెందిన నారాయణరెడ్డితో కళ్యాణికి వివాహం అయింది. భర్త నారాయణరెడ్డి ఉద్యోగ దృష్ట్యా వీరు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉండేవారు. అయితే ఇటీవల భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. అవి తారాస్థాయికి చేరడంతో.. కళ్యాణి తన ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం ఉదయం తాడేపల్లి నుండి కుక్కలవారిపాలెంలోని పుట్టింటికి వచ్చింది. అనంతరం ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త నారాయణరెడ్డిని అదుపులోకి తీసుకోని విచారించారు.

Also read: Bike Triple Riding: మేము అధికారంలోకి వస్తే “బైక్ పై ట్రిపుల్ రైడింగ్”కు అనుమతిస్తాం: ఓపీ రాజ్‌భర్