జీతాలు పెంచుతానంటూ లైంగిక వేధింపులు : SVBC చైర్మన్ పృథ్వీ రాసలీలల ఆడియో విడుదల

ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు గురి చేశారని

  • Published By: veegamteam ,Published On : January 12, 2020 / 05:38 AM IST
జీతాలు పెంచుతానంటూ లైంగిక వేధింపులు : SVBC చైర్మన్ పృథ్వీ రాసలీలల ఆడియో విడుదల

ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు గురి చేశారని

ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పృథ్వీ రాసలీలకు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) నేతలు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పృథ్వీ ఆడియోని రిలీజ్ చేశారు. పృథ్వీపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మురళి తీవ్రంగా మండిపడ్డారు.

ఎస్వీబీసీ చైర్మన్ గా ఓ కామాంధుడిని నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను వేధించే వ్యక్తిని చైర్మన్ గా కూర్చోపెట్టారని సీరియస్ అయ్యారు. పృథ్వీ రాజ్ మొదట శ్రీవారికి పరమభక్తుడిగా నటించారని అన్నారు. పృథ్వీ ఎస్వీబీసీ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారని, జీతాలు పెంచుతానంటూ లోబర్చుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో కొనసాగే హక్కు పృథ్వీకి లేదన్నారు.

cituee

అటు ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం సైతం పృథ్వీపై ఆగ్రహంగా ఉంది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చైర్మన్ పదవిలో పృథ్వీ కొనసాగితే ఎస్వీబీసీకి అప్రతిష్ట అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 30మంది ఉద్యోగులను ఇష్టానుసారం నియమించారని, డబ్బు వసూలు చేశారని పృథ్వీపై ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

* మరో వివాదంలో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్
* ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన పృథ్వీ
* పృథ్వీ రాసలీలల ఆడియో టేపుల కలకలం
* మహిళా ఉద్యోగితో పృథ్వీ మాట్లాడిన ఆడియో టేపులను మీడియా ముందుంచిన ఎస్వీబీసీ ఉద్యోగులు
* ఎస్వీబీసీ చైర్మన్ గా కొనసాగే హక్కు పృథ్వీకి లేదు : SVBC గౌరవ అధ్యక్షులు మురళి
* మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారు

* పద్మావతి గెస్ట్ హౌస్ లోనే పృథ్వీ మద్యం సేవించేవారు-మురళి
* పృథ్వీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్
* మహిళలను వేధించే నటుడిని తీసుకొచ్చి ఎస్వీబీసీ చైర్మన్ గా పెట్టారు
* ఉద్యోగులను బూతులు తిడుతున్నాడు.. ఉద్యోగినులను లైంగికంగా వేధిస్తున్నాడు
* 30మంది దగ్గర డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు

* టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మందలించడంతో ఉద్యోగులను తొలగించారు
* ఈ వ్యవహారంపై సీఎం జగన్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి
* ఎస్వీబీసీ పదవి నుంచి పృథ్వీని తొలగించాలన్న డిమాండ్ తో జనవరి 13న టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తాం 
* పృథ్వీని పదవిలో కొనసాగిస్తే ఎస్వీబీసీకి అప్రతిష్ట
* ఓ కామాంధుడు ఎస్వీబీసీ చైర్మన్ కావటం దారుణం

Also Read : మహిళా ఉద్యోగితో ఫోన్‌లో సరసాలు: అడ్డంగా బుక్కైన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ