CM Jagan Grant : ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2కోట్లు, ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20లక్షల గ్రాంట్ ప్రకటించారు. అలాగే ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు కేటాయించారు.

CM Jagan Grant : ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2కోట్లు, ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

Cm Jagan Grant (1)

Updated On : July 18, 2022 / 11:10 PM IST

CM Jagan Grant : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20లక్షల గ్రాంట్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు జగన్. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు జగన్.

CMJagan On MLA Tickets : వారికి మాత్రమే టిక్కెట్లు.. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సీఎం జగన్

”ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనుల కోసం రూ.20 లక్షలు కేటాయిస్తున్నా. ‘గడపగడపకు…’ వెళ్లినప్పుడు ప్రజల నుంచి వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో చేయాల్సిన పనుల కోసం ఈ డబ్బు వినియోగించాలి. ఒక నెలలో ఎమ్మెల్యేలు పర్యటించే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే ఆయా జిల్లాల కలెక్టర్లకు డబ్బు పంపుతున్నాం. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై జీవో కూడా ఇచ్చాం” అని జగన్ అన్నారు.

pawan kalyan: మా పార్టీ అధికారంలోకి వ‌స్తే ఈ ప‌నుల‌న్నీ చేస్తాం: ప‌వ‌న్ క‌ల్యాణ్

సీఎం అభివృద్ధి నిధి నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు ఉంటుందని, సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనం అని సీఎం జగన్ వివరించారు. “ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించడాన్ని ఓ చాలెంజ్ గా తీసుకుంటున్నా. మీరు చేయాల్సిందల్లా ‘గడపగడపకు…’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే” అని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను సందర్శించాలని జగన్ స్పష్టం చేశారు. కనీసం 16 రోజులు, గరిష్ఠంగా 21 రోజులు ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కమిట్ మెంట్ తో ముందుకు వెళ్లాలన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు జగన్. అలాంటోళ్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో 87శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని.. వారి మద్దతు ఉంటే వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు సాధించడం కష్టమేమీ కాదని గడప గడపకు మన ప్రభుత్వంపై జరిపిన సమీక్షలో జగన్ అన్నారు. తాను చేయాల్సింది అంతా చేస్తున్నానని.. ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తామన్నారు.