CM Jagan On Revenue : ఆదాయం పెంచాలని సీఎం జగన్ ఆదేశం, ఆ శాఖ ప్రక్షాళనకు నిర్ణయం

ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రభుత్వ శాఖల ప్రగతిని సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan On Revenue : ఆదాయం పెంచాలని సీఎం జగన్ ఆదేశం, ఆ శాఖ ప్రక్షాళనకు నిర్ణయం

Cm Jagan On Revenue

CM Jagan On Revenue : ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల అధికారులతో సీఎం జగన్ శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణ, మైనింగ్, రిజిస్ట్రేషన్లు, భూగర్భగనులు, అటవీ శాఖల మంత్రులు, ఉన్నధికారులతో సమీక్ష నిర్వహించారు జగన్. శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. వాణిజ్య పన్నుల శాఖలో ప్రతి ఒక్కరి బాధ్యతపై స్పష్టత ఉండాలన్నారు ముఖ్యమంత్రి జగన్. అటు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్నాయని అన్నారు సీఎం జగన్. బొగ్గు గనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బొగ్గును ఏపీ అవసరాలకు వినియోగించుకునేలా చూడాలన్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించి తనకు నివేదిక ఇవ్వాలన్నారు.

”అన్ని శాఖల్లో ప్రొఫెషనలిజం పెంచుకుని ఆదాయాలు పెంచుకోవాలి. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలి. టిడ్కోకు సంబంధించి రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. ఎలాంటి సేవలు పొందవచ్చనే అంశాలపై సిబ్బంది ప్రజలకు తెలియజేయాలి. కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా రిజిస్ట్రేషన్‌ పరంగా అందించే ఇతర సేవలపైనా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి, ఎలాంటి భద్రత వస్తుందనే దానిపై అవగాహన కల్పించాలి” అని సీఎం జగన్ చెప్పారు.

APDC-WhatsApp : ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వాట్సాప్ సేవలు..ప్రజలకు మరింత వేగంగా ప్రభుత్వ సమాచారం

గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పత్రాలతో రిజిస్ట్రేషన్‌ సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. క్రమంగా ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 14వేల మంది గ్రామ, వార్డు కార్యదర్శులకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా ఇస్తున్నట్టు వివరించారు. అక్టోబర్ 2 నాటికి తొలి విడత కింద రిజిస్ట్రేషన్‌ సేవలు, భూహక్కు-భూ రక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి జగన్.