Thirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. పైకప్పు నిర్మాణం, విద్యుత్‌ తోపాటు వాటర్‌ వర్క్స్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి.

Thirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు

Tirumala (1)

footpath from Alipiri to Thirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. పైకప్పు నిర్మాణాన్ని పూర్తిచేయడంతో పాటు విద్యుత్‌, వాటర్‌ వర్క్స్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 11 నుంచి నడక మార్గాన్ని టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అలిపిరి నడక మార్గంలో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం గతేడాది సెప్టెంబరులో పనులు ప్రారంభంకాగా.. దాదాపు పూర్తయయ్యాయి. పనులు వేగవంతం చేయడం కోసం .. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి భక్తులకు అనుమతిని రద్దుచేసింది.. టీటీడీ. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు నడకదారి భక్తులు వెళ్తున్నారు.

Tirupati Brahmotsavam 2021: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు.. హంస వాహనంపై స్వామివారు

అలిపిరి నడకదారిపైన దశాబ్దాల క్రితం నిర్మించిన పైకప్పు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అలిపిరి మెట్ల మార్గంలో పైకప్పును కొత్తగా నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందుకు అయ్యే మొత్తం ఖర్చు 25 కోట్ల రూపాయలను.. టీటీడీకి విరాలంగా ఇవ్వడానికి .. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకు వచ్చింది. అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి గాలిగోపురం వరకు 1.4 కిలోమీటర్ల మేర మెట్ల దారిలో.. 7.5 కోట్ల వ్యయంతో గాల్వలూమ్ షీట్లను ఏర్పాటు చేశారు.

CM Jagan : సీఎం జగన్ తిరుపతి పర్యటన

ఇక గాలి గోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు 3 కిలోమీటర్ల మేర పైకప్పుకు .. ఆర్‌సీసీ స్లాబ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 17.5 కోట్ల రూపాయలు కేటాయించారు. నడకదారిలోని నరసింహస్వామి వారి ఆలయం నుంచి తిరుమల వరకు ఉన్న పైకప్పు కొత్తగా నిర్మించినదే కావడంతో దానికి ఎటువంటి మరమ్మత్తులు నిర్వహించలేదు.

తిరుపతిలోని శ్రీనివాసం అలిపిరి వద్ద నుంచి నడిచి వెళ్ళే మొక్కులు చెల్లించుకుని భక్తుల కోసం.. ఇప్పటివరకూ శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ నెల 11న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా నడకదారి ప్రారంభించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. మరో రెండు రోజుల్లో అలిపిరి మార్గం ఓపెన్‌ అవుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.