CM Jagan : సీఎం జగన్ గొప్ప మనసు.. చిన్నారి ప్రాణానికి భరోసా

సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్న సీఎం జగన్.. తాజాగా మరో చిన్నారికి ఆపన్నహస్తం అందించారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan : సీఎం జగన్ గొప్ప మనసు.. చిన్నారి ప్రాణానికి భరోసా

CM Jagan : సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్న సీఎం జగన్.. తాజాగా మరో చిన్నారికి ఆపన్నహస్తం అందించారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణానికి సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఆ చిన్నారికి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ వెళ్తుండగా.. కొంతమంది సీఎంను కలవడానికి ప్రయత్నించారు. అంత రద్దీలోనూ వారిని గమనించిన జగన్.. ‘సభ దగ్గరకు తీసుకురండి.. నేను చూసుకుంటా’ అని బస్సు నుంచే సైగ చేశారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న వారిని గుర్తించిన జగన్ వారితో మాట్లాడారు.

విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తన ఏడేళ్ల కుమార్తె ఇంద్రజ అనారోగ్య సమస్యను సీఎంకు వివరించింది. చిన్నారి పరిస్థితిని, ఆ తల్లిదండ్రుల బాధను చూసి చలించిపోయారు సీఎం జగన్. ఆ కుటుంబానికి సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పలకరించిన సీఎం జగన్.. భయపడొద్దని భరోసా ఇచ్చారు. నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కి.. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా చికిత్స అందించాలని, చిన్నారికి అవసరమైన ఆపరేషన్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్కడికక్కడే రూ.10వేల పెన్షన్ మంజూరు చేశారు సీఎం జగన్.

సీఎం జగన్ పెద్ద మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దటీజ్ జగన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆపద్బాంధవుడు జగన్.. అంటూ కితాబిస్తున్నారు.