CM Jagan : భీమవరానికి సీఎం జగన్, పేలుళ్ల కలకలం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ పరిశీలించారు. పేలుడు ఎలా జరిగిందో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

CM Jagan : భీమవరానికి సీఎం జగన్, పేలుళ్ల కలకలం

Cm Jagan

Bhimavaram : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ పరిశీలించారు. పేలుడు ఎలా జరిగిందో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read More : Afghan : ఆప్ఘాన్ గన్ ప్రభుత్వాన్ని గుర్తించము.. ఇండియా సహా 12దేశాల నిర్ణయం

భీమవరం – ఉండి రోడ్డులో డాగ్‌స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. విజయవాడ నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అటు భీమవరం బైపాస్‌లో అర్థరాత్రి కెమికల్ ట్యాంకర్ పేలింది. వెల్డింగ్ చేస్తున్న సమయంలోనే ట్యాంకర్ పేలినట్లు పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ పేలుడుతో కరెంటు తీగలు తగిలి రేకుల షెడ్డు ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Read More : Coronavirus : బాబోయ్.. ఒక్కరోజే 7లక్షల కరోనా కేసులు, 10వేల మరణాలు

పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని ఎస్పీ రాహుల్ దేవ్‌ వర్మ తెలిపారు. ఘటనాస్థలంలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయని.. వాటి వల్ల ఏమైనా పేలుడు సంభవించిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read More : Grandma Love Story : ఆమెకు 61, అతడికి 24… ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు

భీమవరం పర్యటనలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం హాజరవుతారు. ఉదయం 11.15 గంటలకు వివాహ వేదిక కె కన్వెన్షన్ కు సమీపంలో ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 11.25 గంటలకు కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ప్రస్తుతం పేలుళ్ల కారణంగా..సీఎం పర్యటన ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి.

Read More : Nasal Vaccine : ముక్కు ద్వారా వేసే టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!