Renuka Chaudhary : అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తోన్న రేణుకా చౌదరి

అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలి

Renuka Chaudhary : అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తోన్న రేణుకా చౌదరి

Renuka

Amaravati farmers’ maha padayatra : అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఆమెను శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడూతూ అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి వెళ్తున్నట్లు ప్రకటించారు. రైతులు దేశానికి వెన్నెముక..అలాంటి రైతులను ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందన్నారు.

అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు.. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. తాను సైనికుడి కూతురిని…దేశంలో ఎక్కడైనా పర్యటిస్తా…తనకు భయం అంటే ఏంటో తెలియదన్నారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉంటుందన్నారు. అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘమని కొనియాడారు. మహిళల చేతులకు ఉన్నవి గాజులు కావు.. విష్ణు చక్రాలు అని అభివర్ణించారు. మహిళలు ఓటుతో ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Maha Padayatra : అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

ఏపీ ప్రభుత్వం రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తీసుకువచ్చిందని విమర్శించారు. సాటి మహిళలుగా తనకు బొట్టుపెట్టేందుకు మహిళలు వస్తే పోలీసులు అడ్డుకోవడం మంచి పద్ధతికాదని హితవుపలికారు. రేణుకా చౌదరి అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఏపీలో గల్లీ… గల్లీ…ఎప్పుడో తిరిగానని గర్తు చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. ఉదయం 9 గంటల 5 నిమిషాలకు మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తుళ్లూరు రైతు దీక్ష శిబిరంలోని కాలభైరవ, లక్ష్మీ గణపతి ఆలయాల్లో పూజలు చేశారు. యాత్రలో భాగంగా రైతులు ఏడు కిలోమీటర్ల దూరంలోని పెదపరిమికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఇక అక్కడ నుంచి మరో ఏడు కిలోమీటర్లు నడిచి తాడికొండలో రాత్రికి బస చేస్తారు. ఈ మహా పాదయాత్ర నవంబర్ 17 వరకు జరగనుంది.