Andhra Pradesh : భార్య, ఇద్దరు పిల్లలను చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య
టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

constable
Kadapa In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లోని కడపలో దారుణం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ కుటుంబం మొత్తం చనిపోవటం తీవ్ర విషాదాన్ని కలిగించింది. కడపలోని కోపరేటివ్ కాలనీలో నివసించే కానిస్టేబుల్ కుటుంబం మొత్తం చనిపోయింది. భార్యా, ఇద్దరు పిల్లలను చంపి ఆ తరువాత కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కడపలోని కోపరేటివ్ కాలనీలో కుటంబంతో నివసిస్తున్నాడు. ఈక్రమంలో వెంకటేశ్వర్లు తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తన తుపాకీతో భార్యా, పిల్లలను కాల్చి చంపి తరువాత తాను కూడా అదే తుపాకితో కాల్చుకుని చనిపోయినట్లుగా తెలుస్తోంది.
కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబం ఘటన గురించి స్థానికులు అందించిన సమాచారంతో ఘటానా స్థలానికి వచ్చిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని కుటుంబం అటువంటి పరిస్థితుల్లో చనిపోవటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.