మృతదేహాలతో నిండిపోతున్నగుంటూరు GGH ఆసుపత్రి

  • Published By: madhu ,Published On : July 27, 2020 / 09:53 AM IST
మృతదేహాలతో నిండిపోతున్నగుంటూరు GGH ఆసుపత్రి

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల సంఖ్య చేరుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి.

గుంటూరు జిల్లాలో కరోనా విస్తరిస్తూనే ఉంది. జీజీహెచ్ ఆసుపత్రికి కరోనా రోగుల తాకిడి అధికంగానే ఉంటోంది. అంతేగాకుండా…మృతదేహాలతో మార్చురీ నిండిపోయింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే.

పరీక్షలు ఆలస్యం కావడంతో మార్చురీ నిండిపోయిందని తెలుస్తోంది. దీంతో కొన్ని మృతదేహాలను బయటే ఉంచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు ఆసుపత్రి వద్ద ఓ మృతదేహాం ఉండగా..మరో డెడ్ బాడీ…పొదిలి ప్రసాద్ మిలీనియం బ్లాక్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ చూస్తూనే వెళుతున్నారే..కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీనికి సంంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. దీంతో సిబ్బంది మృతదేహాలను వేరే చోటికి తరలించారు.

గుంటూరు జిల్లాలో 547 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 10 వేల 3 కేసులు రికార్డయ్యాయి. 4 వేల 971 యాక్టివ్ కేసులుండగా 4 వేల 934 మంది డిశ్చార్జ్ అయ్యారు. 98 మంది చనిపోయారు.

మరోవైపు ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. 2020, జులై 26వ తేదీ ఆదివారం కొత్తగా 7,627 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. గడిచిన 24 గంటల్లో 47,645 శాంపిల్స్‌ పరీస్తే.. 7 వేల 627 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. 3,041 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 46,301కి చేరింది. తాజాగా కరోనాతో 56 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,041గా నమోదైంది.