Andhra Pradesh : అమిత్ షా నంబర్ వన్ క్రిమినల్, మోదీకి 30మంది దత్తపుత్రులు : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో పాటు ఏపీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh : అమిత్ షా నంబర్ వన్ క్రిమినల్, మోదీకి 30మంది దత్తపుత్రులు : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana

Andhra Pradesh : ‘మోఢీ హఠావో దేశం భచావో’ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో మోఢీ జగన్ హఠావోఏపీ భారత్ బజావో అనేనినాదంతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఇంటింటికి పాదయాత్రలు చేయడంతోపాటు సభలు నిర్వహించబోతున్నాం. అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాపై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా నంబర్ వన్ క్రిమినల్…12మందిని చంపిన అమిత్ షా హోమినిస్టర్ అయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం గవర్నర్ల నియామకాల్లో ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. కానీ ఏపీకి ఇటీవల నియామకమైన గవర్నర్ ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న వ్యక్తి కా్తీ గతంలో జస్టిస్ గా పనిచేసిన కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అక్రమాలకు జస్టిస్ గా ఉన్నకాలంలో అడ్డగోలుగా సపోర్ట్ చేశారని అన్నారు.అందుకే ఛీఫ్ జస్టిస్ గా రిటైర్డ్ అయిన వెంటనే ఏపీ గవర్నర్ గా నియించారని విమర్శించారు. బీజేపీ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని అనటానికి ఇదోక ఉదాహరణ అని అన్నారు.

ఈ సందర్భంగా నారాయణ ఏపీ సీఎం జగన్ పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టు వేలకోట్ల మద్యం కుంభకోణాలు జరుగుతున్నాయని చెబితే వీటిపై కేసు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.ప్రతీ జిల్లాలో అధికార ప్రభుత్వ ఎమ్మెల్యేలు భూఅక్రమాలు, మైనింగ్ కుంబకోణాలు పాల్పడుతున్నారని..ఇటువంటి దారుణాలపై ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకుంటారా? అని ఎద్దేవా చేస్తు ప్రశ్నించారు. ఏపీలో విపత్కరమైన రాజకీయాలు చోటుచేసుకున్నాయని..కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏపీలో పెనుమార్పులు రాబోతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో పొలిటికల్ రెవల్యూషన్ రాబోతోందని..రాహుల్ గాంధీ అంటే మోఢీకి భయం ఉందని అందుకే ఆయన్ని పార్లమెంట్ నుండి తప్పించారని ఆరోపించారు.

పబ్లిక్ సెక్టార్ ను కూలదోసి ప్రైవేట్ సెక్టార్ ను మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందని..దీనిద్వారా ప్రజలసంపదను దోపిడిచేసుకోంటోందని విమర్శించారు. పెట్టుబడి పెట్టేది ప్రభుత్వం వాటిల్లో వ్యాపారం చేసేది మాత్రం ప్రెవేట్ వ్యక్తులని..మోదీ అదానికి దేశ సంపద మొత్తం దోచిపెడుతున్నారని విమర్శించారు.అదానికి మోదీకి సీతలాగా మారాడని..దేశ సంపదను హరించేలా ప్రధాని మోఢీ వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మోదీకి వారసులు లేకపోయినా సన్యాసి అయినా ఆయనకు అదానీతో సహా 30మంది దత్తపుత్రులు ఉన్నారంటూ ఎద్దేవా చేస్తు విమర్శలు సంధించారు.