Cyclone Asani : ‘అసని‘ తుపాను ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు..!
Cyclone Asani : బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. దిశను మార్చుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. కోనసీమ కాకినాడ సముద్ర తీరం వెంబడి అసని తుపాను పయనిస్తోంది.

Cyclone Asani : బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. దిశను మార్చుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. కోనసీమ కాకినాడ సముద్ర తీరం వెంబడి అసని తుపాను పయనిస్తోంది. తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి. తీరం వెంబడి పయనించే సమయంలో ఈదురు గాలిలుతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. కాకినాడ కోనసీమ జిల్లాల తీర ప్రాంతం వెంబడి సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
ఎగిసి పడుతున్న కెరటాలకు ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది. తహిసిల్దారు కార్యాలయాలలో కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. తీరప్రాంత మండలాల్లోని ఉద్యోగులను అధికారులు అప్రమత్తం చేశారు. మూడు జిల్లాల్లో పోలీస్, రెవిన్యూ, ఫైర్, మిగిలిన శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వీస్తున్న ఈదురు గాలులతో వర్షపాతం నమోదైంది.

Cyclone Asani Impact All Flights Cancelled At Andhras Vizag Airport
అసని తుపాను ఎఫెక్టుతో ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. అసని తుపాను దెబ్బకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని విమాన సర్వీసులను మళ్లిస్తున్నారు. మంగళవారం 19 వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు. బుధవారం ఇండిగో 23 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ – విశాఖ, బెంగళూరు – విశాఖ సర్వీసులను రద్దు చేసుకుంది. ఎయిర్ ఇండియా సర్వీసులను కూడా రద్దు చేసుకున్నారు. ముంబై – రాయ్ పూర్, విశాఖ-ఢిల్లీ సర్వీసులను రద్దు చేశారు. విమానాల ల్యాంగిండ్‌కు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమే కారణమని ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. అసని తుపాను దెబ్బకు దక్షిణ మధ్య రైల్వే బుధవారం పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. మొత్తంగా 37 రైళ్లు రద్దయ్యాయి. ఇందులో విజయవాడ- మచిలిపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్ – నిడదవోలు, నిడదవోలు – నర్సాపూర్, నర్సాపూర్ – విజయవాడ, విజయవాడ – నర్సాపూర్, నిడదవోలు – భీమవరం జంక్షన్, భీమవరం జంక్షన్ – నిడదవోలు, మచిలీపట్నం – గుడివాడ, భీమవరం జంక్షన్ – మచిలీపట్నం, గుడివాడ – మచిలీపట్నం, నర్సాపూర్ – గుంటూరు, గుంటూరు – నర్సాపూర్, కాకినాడ పోర్ట్ – విజయవాడ రైళ్లను రద్దు చేసింది.
Read Also : Asani Cyclone: తగ్గని అసని బీభత్సం.. గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ
1Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు
2Madhya Pradesh : వివాహేతరం సంబంధంపై అనుమానం-స్నేహితుడిని చంపి పూడ్చిపెట్టిన జంట
3TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు?
4China-Taiwan Conflict : తైవాన్ను చైనా టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? తైవాన్ మాదేనని చైనా ఎందుకు చెప్తోంది?
5Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
6Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి
7Agent: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న ఏజెంట్
8Amalapuram High Tension : అమలాపురంలో హైటెన్షన్.. కోనసీమ కోసం కదంతొక్కిన ఆందోళనకారులు, పోలీసులపై రాళ్ల దాడి
9Biden Warn to China : తైవాన్ జోలికొస్తే సహించేది లేదంటూ చైనాకు అమెరికా వార్నింగ్..
10Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో విచారణ వాయిదా.. ఎల్లుండి ముస్లిం పిటిషనర్ల వాదనలకు చాన్స్
-
Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
-
After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!
-
Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన
-
Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? భయపడాల్సిన పనిలేదు
-
Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్
-
Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్కు ముహూర్తం పెట్టిన రామ్..?
-
PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
-
Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!