Chandrababu Naidu : శిశుపాలుడు కంటే ఎక్కువ తప్పులు చేశారు, జగన్ పని అయిపోయింది- చంద్రబాబు నిప్పులు

ఓటేసిన పాపానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఏ వ్యక్తికి కూడా కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేకుండా చేశారు. Chandrababu Naidu - YS Jagan

Chandrababu Naidu : శిశుపాలుడు కంటే ఎక్కువ తప్పులు చేశారు, జగన్ పని అయిపోయింది- చంద్రబాబు నిప్పులు

Chandrababu Naidu - YS Jagan

Updated On : August 26, 2023 / 9:10 PM IST

Chandrababu Naidu – YS Jagan : జగన్ సర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ పని అయిపోయిందన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఇంటికి పంపడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం అని చంద్రబాబు జోస్యం చెప్పారు. శిశుపాలుడు కంటే జగన్ ఎక్కువ తప్పులు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

జగన్ ను రాష్ట్ర ప్రజలు ఇక భరించే పరిస్థితుల్లో లేరని చంద్రబాబు అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు, ఖర్చులు పెరిగిపోయాయని.. ఆదాయం తగ్గిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.(Chandrababu Naidu)

Also Read..Nagari Constituency: నగరిలో ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారో!?

”పుండు మీద కారం చల్లినట్లు జగన్ కు రుణపడి ఉండాలని బాండ్ రాసివ్వాలంట. ఏ వ్యక్తి అయినా ఈ పని చేస్తాడా? ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి. ఒక్క ఛాన్స్ అన్నాడు.. మీరు మోసపోయారు. ఓటేసిన పాపానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఏ వ్యక్తికి కూడా కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేకుండా చేశారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అందుకే అందరూ ఆలోచన చేయండి. ఎందుకు జగన్ కి రుణపడి ఉండాలి? ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు పనికిరావు. ఎవరూ కూడా సంతకం పెట్టొద్దు. మీ డిజిటిల్ సిగ్నేచర్లు తీసుకుని మీ డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితికి దిగజారిపోయారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. మద్యపానంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 15వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఏపీకి అప్పు ఇవ్వడానికి కూడా బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది” అని చంద్రబాబు అన్నారు.(Chandrababu Naidu)

Also Read..Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?

”ఈ జగన్ కు ఇసుకే ఆహారం. ఇసుక, గనులు లేకపోతే ఆయనకు భోజనమే లేదు. ఇంకోపక్క చూస్తే భూములే పలహారం. మద్యమే మంచినీరు. విధ్వంసమే ఆశయం. హింసించడమే ఆనందం. లక్ష కోట్ల దోపిడీయే లక్ష్యం. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు. అందుకే ప్రజలంతా తనకు రుణపడి ఉండాలని జగన్ అంటున్నాడు. జగన్ లాంటి వ్యక్తి ప్రజాస్వామానికి పనికిరాని వ్యక్తి. జగన్ లాంటి వ్యక్తులను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది.(Chandrababu Naidu)

అందుకే చెబుతున్నా.. భరించలేం జగన్, బై బై జగన్.. ఇది మనందరి స్లోగన్ కావాలి. జగన్ పని అయిపోయింది. ఇంటికి పోతున్నాడు. అందుకే తప్పుడు పనులు ఇంకా ఎక్కువ చేస్తాడు. సీఓటర్-ఇండియా టుడే సర్వే, మూడ్ ద ఆఫ్ ద నేషన్ చూశాక.. నువ్వు ఎన్ని దొంగ సర్వేలు చేసినా 6 నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయం” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.