Andhra Pradesh SAAP : ఏపీ శాప్‎ ఎండీపై డైరెక్టర్ల ఆగ్రహం..కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు

ఏపీ శాప్‎ ఎండీపై డైరెక్టర్ల ఆగ్రహం వ్యక్తంచేశారు..కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారంటూ ఆరోపించారు. అర్హత లేనివారికి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ లు ఇచ్చారని..కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారని..ఉద్యోగులను,క్రీడాకారులని పట్టించుకోవడం లేదనే విషయాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేదని వాపోయారు.

Andhra Pradesh SAAP : ఏపీ శాప్‎ ఎండీపై డైరెక్టర్ల ఆగ్రహం..కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు

Andhra Pradesh Saap

Andhra Pradesh Saap : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) వివాదాలకు కేంద్రంగా మారుతోంది.శాప్‎లోని బోర్డు డైరెక్టర్లు, ఎండీ మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి వైఖరితో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.బోర్డు సభ్యులను సైతం ఎండీ పట్టించుకోవడం లేదని శాప్ డైరెక్టర్లు కాలువ నర్సింహులు, డేనియల్, వరలక్ష్మి, భీమిరెడ్డి నాగేంద్ర ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. స్పోర్ట్స్ కోచ్ ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.MD ప్రభాకర్ రెడ్డి బోర్డు సభ్యుల నిర్ణయాలను పట్టించుకోవడం లేదంటు ఆరోపించారు. రూ.5 కోట్లు నిధులు ఉన్నా..సీఎం చెప్పినా ఏమీ అభివృద్ధి చేయడం లేదని..టెండర్లలోనూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు.అర్హత లేనివారికి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ లు ఇచ్చారని..కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారని..ఉద్యోగులను,క్రీడాకారులని పట్టించుకోవడం లేదనే విషయాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేదని వాపోయారు.

ఇటువంటి పరిస్థితులో శాప్ బోర్డు మీటింగ్ లో రసాభసా చోటుచేసుకుంది. బోర్డు మీటింగు లో చర్చించుకుని డైరెక్టర్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తీరుపై శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డితో సహా డైరెక్టర్ లు అంతా మీడియా ముందు అంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్లు మీ దృష్టికి తీసుకువచ్చిన చిన్న చిన్న సమస్యలను కూడా ఎందుకు పరిష్కారం చేయలేదని ఎండీ ప్రభాకర్ రెడ్డిని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రశ్నించారు. ఈనేపథ్యంలో శాప్ బోర్డు మీటింగ్ ను మధ్యలోనే ఆపేసి సిద్దార్థరెడ్డి వెళ్లిపోయారు. దీంతో డైరెక్టర్లు కూడా బయటకు వెళ్లిపోయారు.

శాప్ లో జరుగుతున్న పరిస్థితిపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ మాట్లాడుతు..శాప్ లో అవినీతి జరిగిందనే మాటకి ఆధారాలు లేవని..శాప్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా క్రీడాకారుల కోసం పని‌ చేస్తోందని అన్నారు. జీతాల నిర్ణయం మా పరిధిలో లేదని ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి వివరించామన్నారు. క్రీడా పరికరాల కొనుగోలులో అవినీతి జరగడానికి ఆస్కారం లేదతై.. కొన్ని పరికరాలు ఎక్కువ ధరకు కొటేషన్ ఇస్తే… వెనక్కి పంపేసామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే బోర్డు సమావేశం లో చర్చించాలి తప్ప ఇలా శాప్ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడవద్దని సూచించారు. అవినీతి కి సంబంధించిన ఆధారాలు ఉంటే‌ చూపించాలి తప్ప ఇలా రచ్చకెక్కడదని డైరెక్టర్ లకు సూచించారు. ఎండీ,డెరెక్టర్లకు మధ్య సమన్వయ లోపం వల్లే ఇలా జరిగి అన్నారు చైర్మన్ బైరెడ్డి. శాప్ పరంగా క్రీడాకారులు ను అన్నివిధాలా మేము ప్రోత్సహిస్తామని తెలిపారు.

 

,