Amul Products : అంగన్‌వాడీలకు ‘అమూల్‌’ ఉత్పత్తులు.. కొత్తగా అనంతపురంలో ‘జగనన్న పాలవెల్లువ’

పాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయన్నారు.

Amul Products : అంగన్‌వాడీలకు ‘అమూల్‌’ ఉత్పత్తులు.. కొత్తగా అనంతపురంలో ‘జగనన్న పాలవెల్లువ’

Amul

Amul Products to Anganwadis : ‘అమూల్‌’ సంస్థ ద్వారా ఏపీలోని అంగన్‌వాడీలకు పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్‌ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. కొత్తగా అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువకు అమూల్‌ శ్రీకారం చుడుతోందని సీఎం జగన్‌ అన్నారు. అమూల్‌తో పాడి రైతులకు లాభం చేకూరుతోందన్నారు. పాడి రైతుకు లీటర్‌కు రూ. 5 నుంచి 20వరకు అదనపు ఆదాయం వస్తోందని జగన్‌ వివరించారు.

పాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయని.. వాటి ద్వారా ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న 22.50 లక్షల మంది చిన్నారులు, 7.50 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల పాడి రైతులకు మేలు జరుగుతుందని.. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు.

Tirumala : నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల

అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువకు అమూల్‌ శ్రీకారం చుడుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇది మంచి పరిణామమని.. కొత్తగా అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు ఇది మంచి శుభవార్త అని తెలిపారు. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.