Lagadapati Rajagopal : లగడపాటీ.. చేరబోయేది ఏ పార్టీ..?ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్..!

ఇక పాలిటిక్స్ నాకొద్దు..అంటూ రాజకీయ సన్యాసం తీసుకున్న సంచలన నేత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ఏపీలో హల్ చల్ చేస్తున్నాయి. ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు నెలకొన్నాయి.

Lagadapati Rajagopal : లగడపాటీ.. చేరబోయేది ఏ పార్టీ..?ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్..!

Lagadapati Rajagopal Reentry In Ap Politics (1)

Updated On : April 26, 2022 / 11:00 AM IST

Lagadapati rajagopal : ఇక పాలిటిక్స్ నాకొద్దు..అంటూ రాజకీయ సన్యాసం తీసుకున్న సంచలన నేత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ఏపీలో హల్ చల్ చేస్తున్నాయి. ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు నెలకొన్నాయి. దాదాపు 8 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి తన వ్యాపారాలపై దృష్టి పెట్టిన లగడపాటి మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారే వార్తలు ఏపీ పాలిటిక్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో టీడీపీకి అనుకూలంగా ఉన్న లగడపాటి ఇప్పుడు వైసీపీవైపు మొగ్గు చూపిస్తున్నారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇక.. పాలిటిక్స్ నాకొద్దు. రాజకీయ సన్యాసమే ముద్దు అని.. ఎనిమిదేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఇప్పుడు.. ఆయనే మళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్న గుసగుసలు.. ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు.. ఎవరూ ఊహించని విధంగా అధికార వైసీపీ నుంచి.. ఎంపీగా పోటీ చేస్తారనే న్యూస్.. బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న లగడపాటి.. ఈసారి వైసీపీ వైపు వచ్చే అవకాశాలున్నాయా?

ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా రెండు ఇంట్రస్టింగ్ టాపిక్స్‌పై.. రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది. ఆ రెండు అంశాల మీదే.. అంతా తెగ చర్చించుకుంటున్నారు. ఒకటి.. కాంగ్రెస్‌తో వైసీపీ పొత్తు అని.. మీరు విన్నది.. మేం చెప్పింది నిజమే.. కాంగ్రెస్‌తోనే వైసీపీ పొత్తు అని.. ఓ ప్రచారం సాగుతోంది. ఇదే పెద్ద షాక్ అంటే.. దీనిని మించిన షాక్ మరొకటుంది. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. వైసీపీ నుంచి రీ ఎంట్రీ ఇస్తున్నారనే చర్చ.. ఏపీ పాలిటిక్స్‌లో మొదలైంది. అయితే.. ఇందులో.. ఏది.. ఎంతవరకు నిజమన్నది.. మరికొద్దిరోజుల్లోనే తేలిపోతుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రామచంద్రరావు లాంటి సీనియర్ నాయకులు.. ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు. ఉండవల్లి.. అప్పుడప్పుడు రాజకీయ అంశాలపై స్పందిస్తున్నారు. ఇక.. కేవీపీ, లగడపాటి మాత్రం పాలిటిక్స్‌కి పూర్తి దూరంగా ఉన్నారు. అయితే.. ఈ మధ్యకాలంలో.. ఏపీలో రాజగోపాల్ చేస్తున్న పర్యటనలు, అధికార పార్టీ నాయకులతో సమావేశాల లాంటివన్నీ.. లగడపాటి మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారనే.. ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయ్.

వైసీపీ నాయకులతో.. లగడపాటి జరుపుతున్న రాజకీయ భేటీలతో.. ఆయన వైసీపీలోకి వస్తారనే గుసగుసలు ఊపందుకున్నాయ్. ఈ ప్రచారానికి ప్రధాన కారణం.. ఆయన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో భేటీ అవడమే. మరోవైపు.. విజయవాడ ఎంపీ స్థానానికి.. వైసీపీ తరఫున పోటీ చేసేందుకు.. ప్రస్తుతానికి ఎవరూ లేకపోవడం కూడా మరో రీజన్ అంటున్నారు. గత ఎన్నికల్లో వైపీసీ తరఫున పీవీపీ పోటీ చేసినా.. ఆయన ఓడిపోయాక.. విజయవాడకు దూరంగా ఉన్నారు. ఇప్పుడదే.. ఎంపీ సీటు కోసం లగడపాటి తెగ ప్రయత్నాలు చేస్తున్నారని.. విజయవాడ అంతా అనుకుంటున్నారు. అందుకే.. వైసీపీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే.. లగడపాటి వైసీపీలో చేరేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా.. ఆ పార్టీలోని కొందరు నాయకులు మాత్రం.. ఆయన ఎంట్రీని అంగీకరించడం లేదు. గత ఎన్నికల్లో.. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన రాజగోపాల్ లాంటి వ్యక్తికి.. తమ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదంటున్నారు. అయితే.. ఓ పెళ్లి వేడుకకు హాజరైనప్పుడు.. వసంతకృష్ణ ప్రసాద్‌ని కలిసిన లగడపాటి.. రాజకీయాలకు ఉన్న ఆసక్తితో.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. పాత పరిచయం మేరకే.. పెళ్లిలో కలిశామని.. ఇద్దరూ చెబుతున్నారు. ఇందులో గనక వాస్తవం లేకపోతే.. విజయవాడ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం నిజమయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు.