Nellore : కన్న కొడుకును హత్య చేసిన తండ్రి..ఎందుకో తెలుసా? | Father killed his son at Janardhan Reddy Colony in Nellore

Nellore : కన్న కొడుకును హత్య చేసిన తండ్రి..ఎందుకో తెలుసా?

మద్యానికి బానిసైన మల్లికార్జున ఇంట్లో అందరినీ వేధించేవాడు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తన తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు.

Nellore : కన్న కొడుకును హత్య చేసిన తండ్రి..ఎందుకో తెలుసా?

Father killed son : నెల్లూరు జనార్ధన్ రెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేసి అనారోగ్యంతో మృతి చెందాడని నమ్మించాడు. అంతేకాదు కుమారుడి మృతదేహాన్ని పూడ్చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే అంత్యక్రియలు కూడా చేసేశాడు. అయితే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహమైoది. కుమారుడు మల్లికార్జున లిఫ్ట్‌మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లికార్జున ఇంట్లో అందరినీ వేధించేవాడు. ఆయనకు ఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తన తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు.
Software Engineer : రెండేళ్ల కొడుకును గొంతుకోసి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

అడ్డుకోబోయిన తండ్రిపై కూడా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కోపం ఆపుకోలేపోయిన తండ్రి రోకలి బండతో కుమారుడి తలపై కొట్టగా మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. ఏం చేయాలో అర్థంకాని శ్రీనివాసులు తలకు గుడ్డ కట్టేసి ఫిట్స్‌తో కుమారుడు చనిపోయాడని బంధువులను నమ్మించాడు.

ఎవరికి అనుమానం రాకుండా శ్మశానంలో మృతదేహాన్ని పూడ్చేశాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కూపీ లాగి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. తలకు గాయమైన తండ్రి శ్రీనివాసులను ఆసుపత్రిలో చేర్పించారు.

×