Vivekananda Reddy Murder Case : సిగ్గు అనేది ఉంటే YS జగన్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలి : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

వైఎస్ జగన్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలని..బీజేపీ నేత,మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరిని విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయినందుకు జగన్ ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు.

Vivekananda Reddy Murder Case : సిగ్గు అనేది ఉంటే YS జగన్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలి : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

Adinarayana reddy Sensational comments on vivekananda reddy murder case

Vivekananda Reddy Murder Case : వైఎస్ జగన్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలని..బీజేపీ నేత,మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరిని విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయినందుకు జగన్ ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. సొంత బాబాయి హత్య కేసు నిందితులను పట్టుకోవటానకి జగన్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే వైఎస్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నందునే ఏపీలో విచారణ సరిగా జరగలేదని ఆరోపించారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని..ఈ హత్య కేసులు వైఎస్ కుటుంబ సభ్యులందరిని విచారించాలని డిమాండ్ చేశారు.

సొంత బాబాయ్ హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది అంటూ జగన్ సిగ్గుపడాలని..అటువంటి వైఎస్ కుటుంబం రాజకీయాల్లో ఉండటానికి ఏమాత్రం అర్హులు కాదని వారు అంతా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఏమాత్రం సిగ్గు ఉన్నా ఈ పని చేయాలి అంటూ ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలి చేయటం పట్ల తామంతా సిగ్గుపడుతున్నామని సీఎంగా ఉన్న జగన్ కు మాత్రం ఏమాత్రం సిగ్గులేదని ఒకవేళ సిగ్గు అనేది ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయటమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.