Chittoor: విద్యుత్‌ షాక్‌తో గజరాజు మృతి.. అక్కడే తిష్ట వేసిన ఏనుగుల గుంపు!

ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామీణ మండలం కోతిగుట్ట శివారులో శనివారం విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోతిగుట్ట గ్రామ శివారులో.. ఏనుగుల గుంపు నుంచి ఓ గజరాజు విడిపోగా.. పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆ ఏనుగు ఒంటిని రాసుకునేందుకు ప్రయత్నించింది.

Chittoor: విద్యుత్‌ షాక్‌తో గజరాజు మృతి.. అక్కడే తిష్ట వేసిన ఏనుగుల గుంపు!

Chittoor: ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామీణ మండలం కోతిగుట్ట శివారులో శనివారం విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోతిగుట్ట గ్రామ శివారులో.. ఏనుగుల గుంపు నుంచి ఓ గజరాజు విడిపోగా.. పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆ ఏనుగు ఒంటిని రాసుకునేందుకు ప్రయత్నించింది. ఏనుగు బలానికి విద్యుత్ స్తంభం విరిగిపోగా కరెంటు తీగలన్నీ మీద పడ్డాయి.

దీంతో ఆ ఏనుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఏనుగు ఢీకొనడంతో కరెంట్‌ తీగలు తెగిపడినప్పుడు విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో గుంపులోని మిగిలిన ఏనుగులకు ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి ఈ ఘటన జరగగా.. చనిపోయిన గున్న ఏనుగు కోసం మిగతా ఏనుగుల గుంపు శుక్రవారం వేకువజాముదాకా అక్కడే ఘీంకారాలు చేస్తూ ఉండిపోయాయని స్థానిక రైతులు తెలిపారు.

ఏనుగు మరణించిన చోటే తిష్ట వేసిన 20 ఏనుగులు గుంపు ఆ ప్రదేశంలోనే హల్చల్ చేసినట్లు చెప్పగా.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏనుగులు గ్రామాల్లోకి చొరబడతాయేమోనని గ్రామస్తులు భయంతో వాటిని అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. కానీ గజరాజులు తిరగబడి గ్రామస్తులను తరమడంతో వెనక్కు తగ్గారు.