Gautam Adani: రాజ్యసభ సీటు వార్తలపై అదానీ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది.

Gautam Adani: రాజ్యసభ సీటు వార్తలపై అదానీ క్లారిటీ

Gautam Adani

Updated On : May 15, 2022 / 12:19 PM IST

Gautam Adani: ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. ఆదివారం అదానీ సంస్థ తరఫున ఒక ప్రకటన విడుదలైంది. అందులో గౌతమ్ అదానీకి గానీ, అతడి భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. రాజ్యసభ సీట్ల అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా, ఇద్దరి పేర్లతో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

Gautam Adani: వారెన్ బఫెట్‌ను దాటిన అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానం

అదానీ కుటుంబ సభ్యులు ఎవరికీ రాజకీయాల మీద ఆసక్తి లేదని, ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని సంస్థ ప్రకటించింది. వైసీపీ తరఫున అదానీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో రిలయన్స్ సంస్థకు చెందిన ఒకరికి వైసీపీ రాజ్యసభ సీటు ఇవ్వడంతో, ఈసారి అదానీ గ్రూపునకు చెందిన వారికి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే, తాజాగా అదానీల ప్రకటనతో దీనిపై ఒక క్లారిటీ వచ్చింది.