‘అమ్మఒడి’ పథకం లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 01:54 AM IST
‘అమ్మఒడి’ పథకం లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది

అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రెండో ఏడాది నుంచి 75శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఈ పథకం తీసుకొచ్చారు సీఎం జగన్. పిల్లలను బడికి పంపిస్తే తల్లికి ప్రతీ ఏటా రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తారు. సోమవారం(జనవరి 7,2020) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై జగన్ సమీక్షించారు. ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

జనవరి 9న చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల 400 కోట్లు కేటాయించింది. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి/సంరక్షకులకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయంగా ఇస్తారు. ముందుగా అకౌంట్ లో రూ.1 వేసి లబ్దిదారుల ఖాతాలను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత రూ.15వేల చొప్పున జమ చేస్తారు.

అమ్మఒడి పథకం లబ్ధిదారులకు రూ.15వేలు ఇస్తే పిల్లల అవసరాలకు ఉపయోగిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. పాఠశాలల్లో నాడు-నేడు, అమ్మఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యత విషయమై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ సమీక్షకు సంబంధించిన పలు అంశాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామిని నేరవేరుస్తామని స్పష్టం చేశారు. 

7,231 అనాథ పిల్లలకు అమ్మఒడి నగదు సగం అనాథశ్రమానికి ఇవ్వాలని, మరికొంత పిల్లల పేరు మీద జమ చేయాలని సీఎం సూచించారు. కాగా, 61వేల 345 పిల్లలకు చెందిన వివరాలు సరిగా లభ్యం కావడం లేదని.. మరికొంత సమయం కావాలని అధికారులు సీఎం జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఇక 1,81,603 మంది పిల్లలకు చెందిన కుటుంబాల్లో 300 పైబడి యూనిట్ల కరెంటు వినియోగం ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాల పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై రీ వెరిఫికేషన్‌ చేయించి అర్హులైన వారికి తప్పకుండా అమ్మఒడి వర్తింపజేయాలని సీఎం సూచించారు.

వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో తప్పులు కారణంగా కొందరికి లేని భూమిని ఉన్నట్టుగా చూపిస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. 1,38,965 మంది పిల్లలు ఈ కేటగిరీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వారిని అర్హులుగా గుర్తించాలని చెప్పారు. స్కూల్స్ తెరిచే నాటికి పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం ఇవ్వాలని సీఎం చెప్పారు. ఇంగ్లీష్ మీడియం బోధనపైనా సీఎం సమీక్షించారు. స్వయం శిక్షణ యాప్స్‌ కూడా వెంటనే తయారు చేయాలని చెప్పారు.

గత సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు సంక్రాంతి సెలవుల తర్వాత మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు తెస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు.
* సోమవారం : అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, పప్పు చెక్క
* మంగళవారం : పులిహోర, టమోట పప్పు, ఉడికించిన గుడ్డు
* బుధవారం : కూరగాయల అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, పప్పుచెక్క
* గురువారం : కిచిడి(పెసరపుప్పు అన్నం), టమోటా చట్నీ, ఉడికించిన గుడ్డు
* శుక్రవారం : అన్నం, ఆకు కూర పప్పు, ఉడికించిన గుడ్డు, పప్పుచెక్క
* శనివారం : అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగల్‌

మెనూలో మార్పుల వల్ల అదనంగా రూ.200 కోట్ల మేర ఖర్చవుతుందని సీఎం వివరించారు. నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3 వేల జీతం చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు. మొత్తమ్మీద ఈ పథకానికి రూ.1,294 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 

* అమ్మఒడి లబ్దిదారులకు ఊరట
* 75శాతం హాజరు నిబంధన మినహాయింపు
* ఈ ఒక్కసారికి మాత్రమే
* వచ్చే ఏడాది నుంచి 75శాతం హాజరు ఉండాల్సిందే
* వసతి గృహాల్లో మంచి బెడ్లు
* సంక్రాంతి సెలవుల తర్వాత భోజనం మెనూ మార్పు
Also Read : అనంతలో జేసీ దివాకర్‌ హవా తగ్గిందా?