TS News: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి తెలంగాణ గవర్నర్ తమిళిసై

ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ తీసుకుని మహమ్మారి నుంచి రక్షణ పొందాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచించారు.

TS News: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి తెలంగాణ గవర్నర్ తమిళిసై

Tamilisai

Updated On : January 16, 2022 / 9:05 AM IST

TS News: ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ తీసుకుని మహమ్మారి నుంచి రక్షణ పొందాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం నాడు చిత్తూరు జిల్లా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై ఆదివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని గవర్నర్ తమిళిసై కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన గవర్నర్ కు ఆలయ అధికారులు, అర్చకులు సాదరస్వాగతం పలికారు.

Also read: Congress MLA: కంగనా రనౌత్ బుగ్గల్లాంటి నున్నని రోడ్లు వేస్తా: ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే

స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు గవర్నర్ తమిళిసైకి వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందించారు. దర్శనానంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. ఇక గవర్నర్ తమిళిసైతో పాటు సినీనటులు సప్తగిరి, భరత్ రెడ్డి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.

Also read: Secunderabad Club : సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం… కోట్లలో ఆస్తి నష్టం