GVL Narasimha Rao: టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలపై ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అధికార ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను...

GVL Narasimha Rao: టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలపై ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఫైర్

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అధికార ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరైన రీతిలో నడిపించలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసింది. అనేక నేషనల్ హైవేస్ ను డెవలప్ చేస్తున్నామని, రాబోయే ఆర్థిక సంవత్సరం సుమారు రూ.5వేల కోట్లను కేంద్రం కేటాయించనున్నట్లు తెలిపారు.

కాకినాడలో పెట్రో కెమికల్ ప్రాజెక్ట్‌ను అబివృద్ధి చేయాలనుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందకపోవడంతో ముందుకు జరగడం లేదని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల ఎకరాలు చూపిస్తామని చెప్పింది. కానీ చొరవ చూపలేదు. రెండు ప్రభుత్వాలకు కమీషన్‌లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్‌లపై కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారో తెలియదు. రాజకీయంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. ఆవాస్ యోజన పధకం కింద కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ప్రజలకు ఇవ్వలేదు. టీడీపీ చేతకాని ప్రభుత్వం అని అంటే, మీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతుంది.. ఏం చేసినట్లు అని ప్రశ్నించారు.

Read Also: ‘హోదా’పై.. కేంద్ర హోం శాఖకు జీవీఎల్ లేఖ

అభివృద్ధి కోసం ఇచ్చిన రూ.3వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతాయి. ఆరేళ్ల క్రితం కంటే మూడు రెట్లు ఎక్కువగా మన రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలను నయవంచన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. దాంతో పాటు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ తీసేయడం ఆ వర్గానికి జరిగిన అన్యాయం అంటూ అసహనం వ్యక్తం చేశారు జీవీఎల్.