TDP : పట్టాభికి బెయిల్.. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న కోర్టు

ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరైంది

TDP : పట్టాభికి బెయిల్.. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న కోర్టు

Tdp

TDP : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరు అయింది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు. ఈ నేపథ్యంలోనే పోలీసుల తిరుగుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలని వ్యాఖ్యానించింది. 41సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎలా అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు జడ్జి. 3CMM మేజిస్ట్రేట్ ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాని వివరణ కోరిన హైకోర్టు.

చదవండి : Pattabhi Case : రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు

కాగా సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి ఈ నెల 21న 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ను అదే రోజు మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. 2021 అక్టోబర్ 20 బుధవారం రాత్రి పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు 21తేదీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన దానిపై న్యాయమూర్తికి వివరణ ఇచ్చుకున్నారు పట్టాభి. ప్రభుత్వంపైన గానీ.. సీఎంపైన కానీ వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు.

చదవండి :  Pattabhi Wife: నా భర్తకు ఏమైనా జరిగితే.. వారిదే బాధ్యత..!

ఐతే.. పట్టాభి తరచుగా నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పట్టాభిపై 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం పట్టాభి బెయిల్ పై ఉన్నారని.. జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. బెయిల్‌పై ఉన్నప్పటికీ పట్టాభి బెయిల్‌ ఆంక్షలను పాటించడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానేనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనీ ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఈ నెల 21న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పట్టాభి తరపు లాయర్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది