Gun Misfire Case : గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్, భార్యను చంపేసిన హోం గార్డ్

హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్.. ఇంటి గొడవలతో క్రిమినల్‌గా మారాడు. అడ్డొస్తోందని భార్యను అడ్డు తొలగించాడు. పక్కాగానే స్కెచ్‌ వేశాడు. గన్‌ మిస్‌ ఫైర్‌ అంటూ డ్రామాకు తెర లేపాడు.

Gun Misfire Case : గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్, భార్యను చంపేసిన హోం గార్డ్

Gun Miss Fire

Updated On : April 12, 2021 / 5:45 PM IST

Home Guard Who Killed Wife  : పేరుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. సమాజ రక్షణలో ఓ భాగం అతను. బాధ్యతలు, విధులు పక్కన పెడితే.. పోలీసులకు చిక్కకుండా మర్డర్‌ ప్లాన్స్‌ చేయగల సమర్థుడు. కేసును తనవైపు రాకుండా ఎలా చూసుకోవాలో కూడా తెలుసతనికి. హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్.. ఇంటి గొడవలతో క్రిమినల్‌గా మారాడు. అడ్డొస్తోందని భార్యను అడ్డు తొలగించాడు. పక్కాగానే స్కెచ్‌ వేశాడు. గన్‌ మిస్‌ ఫైర్‌ అంటూ డ్రామాకు తెర లేపాడు. ఓ హోంగార్డుగా ఉంటూ.. పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. విజయవాడలో కలకలం రేపిన గన్ మిస్‌ ఫైర్ కేసులో.. కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను గన్ మిస్‌ ఫైర్ పేరుతో… అడ్డుతొలగించుకున్నాడు హోంగార్డ్ వినోద్.

తాకట్టు పెట్టిన బంగారం విషయంలో గత నాలుగు నెలలుగా హోంగార్డు వినోద్‌.. అతని భార్య సూర్యరత్నప్రభ మధ్య వివాదం జరుగుతోంది. ఈ గొడవలు మరింత పెద్దవవడం.. ఇంటికి వచ్చినప్పుడల్లా తాకట్టు నుంచి బంగారాన్ని ఎప్పుడు విడిపిస్తావంటూ భార్య అడుగుతుండటంతో.. విసుగు చెందాడో ఏమో ఖతర్నాక్‌ ప్లానే వేశాడు హోంగార్డు వినోద్. ఆమెను అడ్డు తొలగించాలని నిర్ణయించాడు. మూడు రోజుల క్రితం తన బాస్‌ ఏఎస్పీ శశిభూషన్‌తో కలిసి అనంతపురం క్యాంప్‌ వెళ్లిన వినోద్.. తనతో పాటు ఏఎస్పీ గన్‌ను వెంట తెచ్చుకున్నాడు. అయితే.. ఈ గన్‌ అతని దగ్గరకు ఎలా వచ్చిందనేది తేలాల్సి ఉంది. భార్యను చంపడానికే గన్‌ తీసుకొచ్చాడా..? ముందుగానే భార్య సూర్యరత్నప్రభన చంపేయాలని ఫిక్స్‌ అయ్యాడా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

హోంగార్డ్‌ వినోదే.. భార్యను కాల్చి చంపినట్టు తేల్చారు పోలీసులు. భార్యపై కాల్పులు జరిపి.. గన్ మిస్‌ ఫైర్ అయినట్టు హోంగార్డ్‌ వినోద్‌ నాటకమాడినట్లు విచారణలో వెల్లడైంది. గత కొంతకాలంగా హోంగార్డు వినోద్‌, అతని భార్య సూర్యరత్నప్రభకు వివాదం జరుగుతోందని.. నిన్న రాత్రి వివాదం పెద్దదవడంతోనే ఆమెపై ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు వినోద్‌. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే గన్ మిస్ ఫైర్ అయిందని వినోద్‌ చెప్పాడని.. విచారణలో నిజం ఒప్పుకున్నాడని చెప్పారు పోలీసులు. వినోద్‌పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read More : మోదీ, అమిత్ షాను కూడా ఉతికి ఆరేస్తాం – కేటీఆర్