Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు

మొత్తం 34 మంది.. టోనీ నుండి గత కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తేల్చారు

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు

Drugs Case

Hyderabad Drugs Case: సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ సప్లయర్ టోనీ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం 34 మంది.. టోనీ నుండి గత కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తేల్చారు. టోనీ పట్టుబడడంతో కొందరు వ్యాపారవేత్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో సంబందం ఉండి.. పరారీలో ఉన్న 15 మంది వ్యాపారవేత్తల వివరాలను పోలీసులు సేకరించారు. ఈమేరకు నాలుగు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also read: Corona India: దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత, కొత్తగా ఎన్నంటే?

ఇప్పటికే A1 టోనీ, A2 ఇబ్రాన్ బాబు షేక్ , A3 నూర్ అహమ్మద్ ఖాన్ A10 నిరంజన్ కుమార్ జైన్, A11 శేషావత్ జైన్, A12 యజ్ఞానంద్ అగర్వాల్ , A13 దండు సూర్య సుమంత్ రెడ్డిలు సహా మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న 15 మందిలో నలుగురు బడా బిజినెస్ మాన్ లు సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్ద పల్లి, అశోక్ జైన్ లుగా గుర్తించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి మహ్మద్ ఆసిఫ్ ఆరిఫ్ , షేక్ మహమ్మద్ షాహిద్ ఆలం, అఫ్తాబ్ పర్వేజ్ , రెహమత్, ఇర్ఫాన్, ఫర్డుస్(A2 ఇమ్రాన్ బాబు భార్య) కూడా పరారీలో ఉన్నారు. 2013 నుంచి హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న టోనీ.. 34 మందితో డ్రగ్స్ అక్రమ దందా చేస్తున్నాడు.

Also read: Corona in Britain: కరోనా మాస్క్ ఆంక్షలు ఎత్తివేసిన ఇంగ్లాండ్