Pawan Kalyan: రాజకీయ జీవితంలో ఓడిపోయాను: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో ఓడిపోయానని చెప్పారు. అయితే, ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని అన్నారు. వైఫల్యం అన్నది విజయానికి సగం బాట వేస్తుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు.

Pawan Kalyan: రాజకీయ జీవితంలో ఓడిపోయాను: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

Pawan Kalwan

Updated On : December 3, 2022 / 7:32 PM IST

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో ఓడిపోయానని చెప్పారు. అయితే, ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని అన్నారు. వైఫల్యం అన్నది విజయానికి సగం బాట వేస్తుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు.

తన వైఫల్యాలను కూడా తాను సానుకూల దృక్పథంతోనే చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ కొంత మంది ఏమీ చేయకుండా కూర్చుంటారని, తాను అలాంటి వాడిని కాదని అన్నారు. తాను ఎంతో కొంత ప్రయత్నించానని చెప్పారు. తాను విఫలమైన రాజకీయ నేతనన్న విషయాన్ని స్వయంగా అంగీకరించాలని వ్యాఖ్యానించారు. అందుకు తాను బాధపడబోనని చెప్పారు.

Bangladesh vs India: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేసిన షమీ

కాగా, 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్, గత ఎన్నికల్లో మాత్రం వామపక్ష పార్టీలతో పోటీ చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒక్కరే (రాపాక వరప్రసాద్) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పవన్ కల్యాణ్ రెండు నియోజక వర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఓటములు ఎదురైనప్పటికీ తాను సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉంటానని పవన్ గతంలో చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..