మరో గంట ఆగి ఉంటే ఆ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేది కాదు, అందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలియకుండానే

కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తొందరపడింది. ఆత్మహత్య చేసుకుంది.

మరో గంట ఆగి ఉంటే ఆ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేది కాదు, అందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలియకుండానే

కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తొందరపడింది. ఆత్మహత్య చేసుకుంది.

కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తొందరపడింది. ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ లో పాస్ కాలేదనే మనస్తాపంతో ఆ అమ్మాయి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కానీ మరో గంట సేపు ఆగి ఉంటే ఆ అమ్మాయి ఇలా చేసి ఉండేది కాదు. తన ప్రాణాలు దక్కేవి. ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేసి అందులో ఫెయిల్ అయిన అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలియకుండానే ఆ అమ్మాయి చనిపోయింది.

ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో:
ధనియాలపేటకు చెందిన బాలిక(17) ఇంటర్‌ చదువుతోంది. ఫస్టియర్ లో ఫెయిల్ అయ్యింది. ఒక్క సబ్జెక్ట్ లో పాస్ అవ్వలేదు. దీంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురై నిత్యం బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో శనివారం(జూన్ 20,2020) సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎలుకుల మందు తింది. ఇది గమనించిన తల్లి వెంటనే కూతురిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆదివారం(జూన్ 21,2020) మృతి చెందింది. దీంతో బాలిక కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరో గంట ఆగి ఉంటే ప్రాణం దక్కేది:
కాగా, శనివారం (జూన్ 20,2020) సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కీలక ప్రకటన చేశారు. టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేసి అందులో తప్పిన అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనకు, బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సమయానికి మధ్య కేవలం గంట వ్యవధి మాత్రమే. మరో గంటపాటు ఆ అమ్మాయి ఆగి ఉంటే  ప్రాణాలు దక్కేవని కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు.

Read: Corona In AP : ఆ రెండు జిల్లాలో వైరస్ ఉగ్రరూపం