YS sharmila : ఏపీలో పార్టీ పెట్టటం గురించి YS షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో పార్టీ పెట్టటం గురించి YS షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS sharmila : ఏపీలో పార్టీ పెట్టటం గురించి YS షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

Ys Sharmila On Party In Ap (2)

YS sharmila on party in ap : ఏపీలో పార్టీ పెట్టటం గురించి YS షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ పెడతారా? అనే ప్రశ్నకు సమాధానంగా షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం షర్మిల అన్న జ‌గ‌న్‌తో విభేదాలు రావ‌డం వల్లే తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల పార్టీ పెట్టార‌ని ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్‌తో విభేదాలు వ‌స్తే ఏపీలో పార్టీ పెట్ట‌కుండా తెలంగాణ‌లో ఎందుకు పెడ‌తార‌న్న సందేహాలూ వ్య‌క్త‌మ‌య్యాయి. ఈక్రమంలో ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టటం వెనుక అన్నాచెల్లెళ్లకు చెడిందని..జగన్ జైల్లో ఉండగా పార్టీని నడిపించి పాదయాత్ర కూడా చేసిన చెల్లిని జగన్ పక్కన పెట్టారని తనకు తగిన న్యాయం చేయకపోవటం..ఎటువంటి పదవి ఇవ్వకపోవటంతో షర్మిళ అన్నతో విభేధించారని అందుకే తెలంగాణలో పార్టీ పెట్టారనే ప్రచారం జరిగింది. ఈక్రమంలో ఏపీలో పార్టీ పెడతారా? అని మీడియా ప్రశ్నించగా షర్మిల చాలా తెలివిగా సమాధానం చెప్పారు.

Read more : Afghanistan: 3,000 లీట‌ర్ల మ‌ద్యాన్ని కాలువ‌లో పార‌బోసిన అఫ్ఘాన్ అధికారులు..మద్యం తాగినా..అమ్మినా సహించం అంటూ వార్నింగ్

‘రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు ..పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఈ విష‌యంపై వైఎస్ ష‌ర్మిల స్పందించారు. మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నాం..ఈ జనవరి 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నహాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రైతులు పండించిన పంటకు సరైన ధర లేక రైతు ఎన్నో కష్టాలు పడుతున్నారని..రైతుల ఆవేదన తెలియజేయటానికి తాను యాత్ర చేపడితే దానికి అనుమతి లేదంటున్నాయని..నిబంధనల ప్రకారం పోతాము అని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదు అంటున్నారు షర్మిల విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్న షర్మిల రైతు బందు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి లేని నిబంధనలు మాకే ఎందుకు పెబుతున్నారు? అని ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కటానికే అర్థం పర్థం లేని నిబంధనలు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కేసీఆర్ దొందు దొందే అంటూ ఎద్దేవా చేశారు. సమస్యల గురించి మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పటంలేదని ఉన్న సమస్యలను డైవర్ట్ చేసేందుకు బీజేపీ నీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు షర్మల.కాగా.. టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గట్టు రాంచందర్ రావును వైఎస్ ష‌ర్మిల కండువా క‌ప్పి త‌మ‌ పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల.