Pawan Kalyan At Vizag Beach : విశాఖ బీచ్‌లో పవన్ కల్యాణ్ షికారు.. ఒంటరిగా కాసేపు వాకింగ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ బీచ్ లో సందడి చేశారు. అక్కడ బీచ్ లో తిరిగారు. అలల్లో కాసేపు సేద దీరారు.

Pawan Kalyan At Vizag Beach : విశాఖ బీచ్‌లో పవన్ కల్యాణ్ షికారు.. ఒంటరిగా కాసేపు వాకింగ్

Pawan Kalyan At Vizag Beach : విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శనివారం సాయంత్రం ఆర్కే బీచ్ లో సందడి చేశారు. పవన్ కల్యాణ్ వైజాగ్ బీచ్ కు వెళ్లారు. అక్కడ బీచ్ లో తిరిగారు. అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో అక్కడ కనిపించిన మత్స్యకారులతో పవన్ మాట్లాడారు. వారి జీవన విధానం, చేపలు పట్టే విధానం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

పవన్ కల్యాణ్ సడన్ గా బీచ్ కు రావడంతో ఆయన్ని చూసేందుకు స్ధానికులు తరలివచ్చారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. బీచ్ నీళ్లలో నడుస్తూ ఎంజాయ్ చేసిన పవన్.. జనం తాకిడి పెరుగుతుంటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ విశాఖ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రధాని మోదీ, జనసేన నేతలతో భేటీలతోనే గడిపిన పవన్ కల్యాణ్.. మరే కార్యక్రమం పెట్టుకోలేదు. తాజాగా ప్రధాని విశాఖను వీడిన తర్వాత విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు పవన్ బయలుదేరారు. ఈ క్రమంలోనే విశాఖ ఆర్‎కే బీచ్‎కు వెళ్లారు. చాలాకాలం తర్వాత బీచ్ కు వెళ్లిన పవన్ కాసేపు ప్రశాంతంగా వాకింగ్ చేశారు. పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. పవన్ కల్యాణ్ బీచ్ లో షికారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆ తర్వాత బీచ్ పక్కనే ఉన్న రుషికొండ దగ్గరికి వెళ్లారు పవన్. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కొన్ని నెలలుగా రుషికొండఫై వైసీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, రుషికొండను మొత్తం తవ్వేస్తున్నారని, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని టీడీపీ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా దానిని పరిశీలించేందుకు పవన్ వెళ్లారు.

కొంతమంది పార్టీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండ చుట్టూ భారీ షీట్లతో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉండగా.. వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారికేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను
ఎక్కి.. బారికేడ్ల అవతలివైపు ఏం జరుగుతోందన్న దాన్ని పరిశీలించారు.

వైజాగ్ బీచ్ లో పవన్ సందడి..