Mudragada Padmanabam : కోడిపందాలకు పర్మిషన్ ఇవ్వండి.. జగన్‌కు ముద్రగడ లేఖ

కోడిపందాలకు ముందుగానే అనుమతి ఇవ్వాలని సీఎం జగన్‌‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖరాశారు.

Mudragada Padmanabam : కోడిపందాలకు పర్మిషన్ ఇవ్వండి.. జగన్‌కు ముద్రగడ లేఖ

Mudragada Padmanabam

Mudragada Padmanabam : సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో కోడిపందాల సందడి నెలకొంటుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన వారు ఎంతో ఆసక్తిగా పందాలు తిలకిస్తుంటారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడంతో అధికారులు కొన్ని చోట్ల పందెం నిర్వాహకులను.. కోళ్లను అరెస్ట్ చేస్తున్నారు. పోయిన సంక్రాంతిని ఇటువంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖరాశారు.

చదవండి : CM Jagan : బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

సంక్రాంతి పండుగ వ‌స్తున్న నేప‌థ్యంలో ఐదు రోజుల పాటు కోడిపందాల పర్మిషన్‌కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముద్రగడ లేఖ ద్వారా సీఎం జ‌గ‌న్‌ను కోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని… గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమ‌ని గుర్తు చేశారు. పోయిన సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిప‌డ్డారు.

చదవండి : CM Jagan : ఆదాయం తగ్గింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది

చివరికి పర్మిషన్ ఇవ్వడంతో పోలీస్ శాఖ కూడా ఇబ్బంది పడుతోందని… పండుగుల సమయంలో ప్రజలకు పని ఉండదు కాబట్టి ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. కోడి పందాలను చూసేందుకు దేశవిదేశాల నుంచి వస్తుంటారని, సంక్రాంతి మనకు పెద్ద పండుగ అని తెలిపారు. ఇవ్వని దృష్టిలో ఉంచుకొని పండుగకు ముందే అనుమతులు ఇవ్వాలని కోరారు ముద్రగడ.

kapu protection leader, mudragada padmanabam, letter to jagan,  sankranthi kodi pandalu