Kodali Nani : లోకేశ్ సమర్ధుడైతే ఇంట్లో మహిళలు రోడ్లమీదకు ఎందుకొస్తారు..? : కొడాలి నాని

చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది అంటూ ఆరోపించారు కొడాలి నాని. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రేూ. 2వేల కోట్లు దాటింది అంటూ విమర్శించారు.

Kodali Nani : లోకేశ్ సమర్ధుడైతే ఇంట్లో మహిళలు రోడ్లమీదకు ఎందుకొస్తారు..? : కొడాలి నాని

kodali nani

Kodali Nani on Nara Lokesh : నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు, భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రారు అంటూ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడుతు..చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు, మగాడు అంటున్నారు. మరి లోకేశ్ సమర్ధుడైతే.. ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారు..? అని ఎద్దేవా చేస్తు ప్రశ్నించారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని..లోకేశ్ ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది అంటూ ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు..? భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారు..? రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ.2వేల కోట్లు దాటింది అన్నారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ. 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు..? కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

Also Read : ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్ర .. ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే..

ఈ సందర్భంగా కొడాలి పవన్ కల్యాణ్ పై కూడా మరోసారి విమర్శలు సంధిస్తు..2019 ఎన్నికల్లో కూడా పవన్ కల్యాణ్ తెరవనుక నుండి టిడిపికి మద్దతుగా ఉన్నారని..ఇప్పుడు మరోసారి ముసుగు తొలగింది అంతే అన్నారు. వవన్ పార్టీ పెట్టింది తన కోసం కాదు చంద్రబాబు కోసమే అన్నారు. పవన్ కల్యాణ్ జనసున్నా పార్టీ పెట్టారు అంటూ ఎద్దేవా చేశారు.

కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మరణించిన విషయం కూడా తెలిసిందే. మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు భార్య సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టారు. బుధవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ‘నిజం గెలవాలి’ పేరిట నారా భవనేశ్వరి ఈ బస్సుయాత్ర చేపట్టనున్నారు.