Tirumala Temple Close : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8న ఆలయం మూసివేత

మరోసారి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. నవంబర్ 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు.

Tirumala Temple Close : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8న ఆలయం మూసివేత

Tirumala Temple Close : ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే. మరోసారి శ్రీవారి ఆలయం మూతపడనుంది. నవంబర్ 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 11 గంటల పాటు మూసివేయనున్నారు. ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.

కాగా, చంద్ర గ్రహణం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు కొనసాగనుంది. చంద్ర గ్రహణం నేపథ్యంలో నవంబర్ 7న సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ తెలిపింది. నవంబర్ 8న గ్రహణం రోజున తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.