Andhra pradesh : మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ నిజంగానే కలిసిపోయారా? ఇదేం సినిమా కాదు అంటున్న నేతలు

బద్ధ శత్రువులుగా ఉన్న మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇప్పుడు కలిసిపోయారు. ఈ హఠాత్పరిణామం వెనుక.. అధినేత జగన్ మార్క్ ఏమైనా ఉందా? అనే.. గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్.

Andhra pradesh : మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ నిజంగానే కలిసిపోయారా? ఇదేం సినిమా కాదు అంటున్న నేతలు

Kakani With Anil Kumar

Andhra pradesh..kakani with anil kumar : ఏదేమైనా.. నెల్లూరు రాజకీయాలు భలే ఇంట్రస్టింగ్‌గా ఉంటాయబ్బా. అవి.. అధికార పార్టీలో అయితే.. ఇంకా ఆసక్తి రేపుతాయ్. మొన్నటిదాకా పచ్చగడ్డి వేయకపోయినా.. భగ్గుమనే పరిస్థితులుండేవి ఆ ఇద్దరి లీడర్ల మధ్య. కానీ.. అధిష్టానంతో మీటింగ్ తర్వాత.. ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేంతలా వాళ్లిద్దరి మధ్య దోస్తీ కుదిరింది. అయితే.. వాళ్లు కలిసిపోవడం.. కిందిస్థాయిలో కొందరు నాయకులకు నచ్చడం లేదు. ఇద్దరూ స్నేహితులుగా కంటే.. ప్రత్యర్థులుగా ఉంటేనే.. పబ్బం గడుపుకోవచ్చని.. ఇలా కలిసిపోతే.. మా పరిస్థితేంటని.. తెగ మదనపడిపోతున్నారు. కానీ ఇదేమీ సినిమా కాదు నిజంగా కలిసిపోవటానికి అంటున్నారు ఇరు వర్గాలకు చెందిన అనుచరులు.

బద్ధకం లేకపోయినా.. మొన్నటిదాకా బద్ధ శత్రువులుగా ఉన్న మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇప్పుడు కలిసిపోయారు. కాకాని.. అనిల్ ఇంటికి కూడా వెళ్లడం.. అక్కడ ఒకరినొకరు సత్కరించుకోవడంతో.. నెల్లూరు జిల్లాలోని రాజకీయ వర్గాలు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలంతా.. ఒక్కసారిగా షాకయ్యారు. అసలు.. ఇదెలా సాధ్యమైందని.. ఒకటే చర్చ. ఇందుకు.. హఠాత్పరిణామం వెనుక.. అధినేత జగన్ మార్క్ ఏమైనా ఉందా? అనే.. గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్.

మంత్రి అయ్యాక.. కాకాణి గోవర్దన్ రెడ్డి.. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ కలుస్తూ వస్తున్నారు. ఇదే సిరీస్‌లో.. అనిల్ కుమార్ యాదవ్‌ని కూడా కలిశారు. తర్వాత.. మీడియా ముందుకొచ్చి.. కాకాణి అన్న అంటూ అనిల్ సంభోదిస్తే.. సోదరుడు అనిల్ అంటూ కాకాణి పిలిచారు.

అసలు విషయం ఏమిటంటే.. మంత్రి కాకాణి, ఎమ్మెల్యే అనిల్ మధ్య కుదిరిన సయోధ్య.. జిల్లా వైసీపీలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులకు అస్సలు నచ్చడం లేదట. మొన్నటి దాకా ఉప్పూ-నిప్పుగా ఉన్న నాయకులిద్దరూ కలిసిపోతే.. తమ పరిస్థితేమిటంటే.. తెగ ఆందోళన చెందుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వాళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్, ఆధిపత్య పోరు కొనసాగితేనే.. కిందిస్థాయిలో ఉన్న మనమంతా పబ్బం గడుపుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారని.. గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసిపోతే.. రాను రాను తమ ఆటలు సాగకుండా పోతాయని.. వాళ్లలో వాళ్లే చర్చించుకుంటున్నారు. అందువల్ల.. అధిష్టానం కుదిర్చిన మైత్రిని తెంచేందుకు.. శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు జిల్లాలో టాక్ నడుస్తోంది.

అయితే.. కాకాణి, అనిల్ కలుసుకోవడంతో నెల్లూరు వైసీపీలో కోల్డ్ వార్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనా? అన్న చర్చ సాగుతోంది. మనుషులు కలిసినా.. మనసులు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నాయా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి.. అంతా బాగానే ఉన్నా.. ఎన్నికల ముందు పరిస్థితులు, రాజకీయాలు ఎలా మారతాయన్నదే ఆసక్తిగా మారింది.