Extra Marital Affair : మహిళతో సహజీవనం… ఆమె కుమార్తెపై అత్యాచారం

భర్తను వదిలేసి వచ్చిన మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి... కామంతో కళ్లు మూసుకుపోయి ఆమె కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

Extra Marital Affair : మహిళతో సహజీవనం… ఆమె కుమార్తెపై అత్యాచారం

Minor Girl Raped

Extra Marital Affair :  భర్తను వదిలేసి వచ్చిన మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి… కామంతో కళ్లు మూసుకుపోయి ఆమె కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.  పెదకాకాని ఎన్టీఆర్ కాలనీకి చెందిన దానమ్మ అనే మహిళ కొన్నేళ్ల క్రితం భర్తతో విభేదాలు వచ్చి తన కుమార్తెతోను తీసుకుని విడిపోయి ఒంటరిగా జీవించసాగింది.

కూలీ పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తూ జీవిస్తున్న దానమ్మకు 10 ఏళ్ల క్రితం రాయపూడి జోజిబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. అప్పటికే పెళ్లైన జోజిబాబు దానమ్మ మోహంలో పడి భార్యా పిల్లలను వదిలేసి ఆమెతో సహజీవనం చేయటం ప్రారంభించాడు. అప్పటి నుంచి ముగ్గురూ ఎన్టీఆర్ కాలనీలో నివసించసాగారు.

ఈ క్రమంలో జోజిబాబు,దానమ్మకు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. దానమ్మ మొదటి భర్త కుమార్తె ప్రస్తుతం ఆరవ తరగతి చదువుతోంది.  ఆ బాలికపై కన్నేసిన  జోజిబాబు ఆదివారం, అక్టోబర్ 10వ తేదీన బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడి చేశాడు.

ఇంటికి తిరిగివచ్చిన తర్వాత బాలిక జోజిబాబు చేసిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పింది. దీంతో దానమ్మ జోజిబాబు తన కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆదివారం రాత్రి బాలికను వైద్య పరీల నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.