MLA Kotamreddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. తన తమ్ముడికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెప్తోందని తెలిపారు.

MLA Kotamreddy
MLA Kotamreddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. తన తమ్ముడికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెప్తోందని తెలిపారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను నిలబడబోనని స్పష్టం చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తానని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ తో తన మనసు కలత చెందిందన్నారు. కంటి నిండా కునుకు లేకుండా చేస్తోందని వాపోయారు. అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టమన్నారు. రాజకీయాలు తనకు కొత్త కాదన్నారు. ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడిగా ఉన్నారు.