VZM MLA VS MLC : విజయనగరం జిల్లా YCPలో ఆధిపత్య పోరు..ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య కోల్డ్ వార్

విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు.. మధ్య ఆధిపత్యపోరునడుస్తోంది.

VZM MLA VS MLC : విజయనగరం జిల్లా YCPలో ఆధిపత్య పోరు..ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య కోల్డ్ వార్

Mla Vs Mlc Polics In Vijayanagar District Ycp

VZM MLA VS MLC : ఆ ప్రాంతంలో.. ఏ కార్యక్రమం జరిగినా.. ఇద్దరు నేతలు వాలిపోతారు. తామంతా ఒకటే అన్నట్లుగా కలరింగ్ ఇస్తారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నట్లుగా కలిసిపోతారు. కానీ.. ఇదంతా కాయిన్‌కి ఒక వైపే. రెండో వైపు ఎంత చూడొద్దనుకున్నా.. చూడాల్సి వచ్చింది. సమాన హోదా ఉన్న ఇద్దరు నేతలు ఒకే చోట ఉంటే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా.. ఆధిపత్యపోరు మొదలవుతుంది. వర్గాలు ఏర్పడి.. వాటిలో విభేదాలు మొదలవుతాయ్. వారి పోరులో.. చిరుద్యోగులు నలిగిపోతున్నారట. అక్కడ ఫాగ్ కాకుండా.. ఏం నడుస్తుందో.. లాగ్ లేకుండా చూసేయండి..

విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు.. కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఇది విని.. వాళ్లిద్దరినీ నిశితంగా పరిశీలిస్తే.. అలాంటిదేమీ లేదని తేలింది. అయినా.. కడుపులో కత్తులు పెట్టుకుంటే.. తిరగడానికి ఎలా వస్తుంది? అందుకే.. కత్తులు, కత్తెర్ల లాంటివేవీ లేకుండానే.. ఆ ఇద్దరు లీడర్లు తిరిగేస్తున్నారు. బయటకు.. కలిసి ఉన్నట్లే కనిపిస్తున్నా.. లోలోపల రాజకీయ విభేదాలు, వివాదాలతో రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు.. ఇద్దరి మధ్య రేగిన ఆధిపత్య పోరే కారణమంటున్నారు.

Also read : TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత

ఎస్.కోట నియోజకవర్గంలో.. తన మాటే నెగ్గాలన్న పట్టుదలతో.. ఇద్దరిలో బీపీతో పాటు గ్యాప్ కూడా పెరిగినట్లు సమాచారం. కానీ.. అధికార పార్టీలో ఉండటంతో.. విభేదాలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారని.. వైసీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. వీళ్లిద్దరి మధ్య ఇగో క్లాష్ తలెత్తినప్పుడు.. జిల్లా పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కలగజేసుకొని.. ఇద్దరికీ సర్దిచెబుతూ వస్తున్నారట.

నిజానికి.. జగన్ పాదయాత్ర టైంలో.. ఎస్.కోటలో పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో.. గజపతినగరానికి చెందిన కడుబండి శ్రీనివాసరావును.. ఎస్.కోటకు ఇంచార్జ్‌గా నియమించారు జగన్. ఆ సానుభూతితోనే.. టికెట్ కూడా ఆయనకే ఇచ్చారు. దీంతో.. మిగిలిన సీనియర్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇప్పటికీ.. లోకల్ సీనియర్లతో ఎమ్మెల్యే ఇబ్బందులు పడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే.. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో.. అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు.. నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే.. ఇద్దరి మధ్య గ్యాప్‌కు కారణమని.. పార్టీలో చర్చ సాగుతోంది.

నియోజకవర్గంలో అధికారుల బదిలీలు, సిబ్బంది పనితీరు విషయాల్లోనూ.. ఇద్దరు నాయకులు తమకు అనుకూలంగా చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇటీవలే.. ఎస్.కోట మండలంలో 83 మంది వాలంటీర్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో.. ఓ వర్గానికి అనుకూలంగా ఉన్న వాలంటీర్లను తొలగించి.. వారి స్థానంలో మరో నాయకుడికి చెందిన వ్యక్తులను వాలంటీర్లుగా నియమించేందుకే.. ఈ తంతు జరిగిందనే వాదన కొనసాగుతోంది.

Also read : AP Politics : లోక్‌సభ స్థానాలపై చంద్రబాబు ఫోకస్..స్ట్రాంగ్ అభ్యర్ధుల కోసం వెదుకులాట

ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ ఆధిపత్య పోరు వల్లే.. వాలంటీర్ల తొలగింపు జరిగిందని.. నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ వ్యవహారం కాస్తా.. జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను దృష్టికి వెళ్లడంతో.. ఆయన కలగజేసుకున్నట్లు సమాచారం. ఇద్దరితోనూ మాట్లాడి.. వాలంటీర్ల తొలగింపు వ్యవహారాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది.