ఆయన చాలా రొమాంటిక్.. చంద్రుడిని చూపించడానికి మేఘాల మీదకు తీసుకెళ్లి..: ప్రియాంక చోప్రా
"ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో"లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Priyanka Chopra: గతంలో తాను జరుపుకున్న కర్వా చౌత్ వేడుక గురించి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
కర్వా చౌత్ వేళ మహిళలు ప్రత్యేక పూజలు చేశాక, జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తమ భర్తలను దర్శించుకుని, వారికి హారతి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ ప్రతి ఏడాది ఈ వేడుకల్లో పాల్గొంటుంటారు.
అయితే, ఓ సారి తనకు ఆకాశంలో చంద్రుడు కనపడలేడని, దీంతో తన భర్త విమానంలో మేఘాల్లోకి తీసుకెళ్లి జాబిల్లిని చూపించాడని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. దీంతో కర్వా చౌత్ రోజున ఉపవాస దీక్ష విరమించానని తెలిపింది.
“ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో”లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిక్ జోనస్ అమెరికన్ పాప్ సింగర్. ఆయన స్టేడియాల్లో ప్రదర్శనలు ఇస్తుంటారు.
వీడియోలో ప్రియాంక ఏం చెప్పింది?
“చంద్రుడిని వెతకడానికి ప్రయత్నం చేశాను. ఆయన (నిక్) ఎక్కడో ఒక స్టేడియంలో ఉన్నారు. స్టేడియంలో షో జరుగుతోంది. అప్పటికి చంద్రుడు కనిపించలేదు. మేఘాలు ఉన్నాయి, వర్షం వచ్చేలా ఉంది. స్టేడియంలో 60-70 వేల మంది ఉన్నారు. షో జరుగుతూనే ఉంది. 10 గంటలు అయింది, 11 గంటలు అయింది.. చంద్రుడు కనిపించట్లేదు. ఇది చాలా రొమాంటిక్ విషయం, నేను మీకు చెబుతున్నాను. విమానంలో నన్ను మేఘాల మీదికి తీసుకెళ్లాడు” అని ప్రియాంక చెప్పింది.
దీంతో నెటిజన్లు “వావ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంకను నిక్ జోనస్ మేఘాల మీదుగా విమానంలో తీసుకెళ్లి, చంద్రుడిని చూసేందుకు సాయం చేశాడంటే ఆయనో గొప్ప భర్త అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా రొమాంటిక్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
