MP CM Ramesh : ఏపీలో అధికారంలోకి రానున్న బీజేపీ పాత్ర ఉన్న ప్రభుత్వం : ఎంపీ సీఎం రమేష్

జూన్11న విశాఖలో అమిత్ షా బహిరంగ సభ జరుగనుంది. ఈ మేరకు శుక్రవారం విశాఖలో బహిరంగ సభ పోస్టర్ ను సీఎం రమేష్, మాధవ్, ఇతర బీజేపీ నేతలు విడుదల చేశారు.

MP CM Ramesh : ఏపీలో అధికారంలోకి రానున్న బీజేపీ పాత్ర ఉన్న ప్రభుత్వం : ఎంపీ సీఎం రమేష్

CM Ramesh

Visakha meeting poster : రాబోయే రోజుల్లో బీజేపీ పాత్ర ఉన్న ప్రభుత్వమే ఏపీలో అధికారంలోకి వస్తుందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. జూన్ 11న కేంద్ర మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన చేయనున్నారని తెలిపారు. 9 ఏళ్ల బీజేపీ పాలన ఎలా సాగిందో బహిరంగ సభలో అమిత్ షా వివరిస్తారని తెలిపారు.

జూన్11న విశాఖలో అమిత్ షా బహిరంగ సభ జరుగనుంది. ఈ మేరకు శుక్రవారం విశాఖలో బహిరంగ సభ పోస్టర్ ను సీఎం రమేష్, మాధవ్, ఇతర బీజేపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ జూన్ 10న తిరుపతిలోని బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా పాల్గొంటారని పేర్కొన్నారు.

Warangal : పొలం దున్నుతుండగా వ్యవసాయ బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ దుర్మరణం

అనంతరం మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ అమిత్ షా కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. రైల్వే గ్రౌండ్స్ లో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. రాత్రి 8 నుంచి 9 వరకూ పోర్ట్ కి సంబంధించిన సాగరమాల హాల్ లో క్రియాశీల బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవుతారని పేర్కొన్నారు.