Nara lokesh Padayatra : ‘యువగళం’ పాదయాత్రను ప్రజలే బలమై నడిపించాలి..రైతన్నను రాజుగా చూసేవరకు విశ్రమించను : నారా లోకేశ్

యువగళం పాదయాత్రను ప్రజలే బలమై నడిపించాలి అని కోరుతు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ..రైతన్నను రాజుగా చూసేవరకు విశ్రమించనని నన్ను మీరే బలమై నడిపించాలని కోరారు.

Nara lokesh Padayatra : ‘యువగళం’ పాదయాత్రను ప్రజలే బలమై నడిపించాలి..రైతన్నను రాజుగా చూసేవరకు విశ్రమించను  : నారా లోకేశ్

Nara lokesh padayatra

Nara lokesh Padayatra :  ఎట్టకేలకు పోలీసుల నుంచి పాదయాత్రకు అనుమలి లభించటంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ యాత్రకు సిద్ధమయ్యారు. 400ల రోజుల పాటు 4000 కిలోమీటర్లు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ యాత్ర జయప్రదంగా కొనసాగాలని..విజయవంతంగా పూర్తి చేసుకోవాలని వేడుకుంటూ సర్వమత ప్రార్థనలకు బయలుదేరారు లోకేశ్. దీని కోసం తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరీల నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తాత ఎన్టీఆర్ ఘాట వద్ద ఘనంగా నివాళులు అర్పించి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. లోకేశ్ ను దగ్గరుండి సీనీనటుడు..పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ కారు ఎక్కించారు.

దీంట్లో భాగంగా తన నివాసం నుంచి బయలుదేరిన లోకేశ్ ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నా పాదయాత్ర ఏ వర్గాల వారి గురించో కాదు..అన్ని వర్గాల బాధితుల తరపున ఉద్యమించాలని పాదయాత్ర చేపట్టానని..కష్టాల్లో కూరుకుపోయిన రైతన్నను రాజుగా చూసేవరకు విశ్రమించనని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రను ప్రజలు బలమై నడిపించాలని కోరారు. అభివృద్ధి అనేమాటకు అర్థం కూడా తెలియని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని నాశనం చేసింది అని..అదేమని ప్రశ్నించే హక్కును కాలరాస్తూ ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వంలో బాధితులే వేధింపులకు గురి అవుతున్నారని బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తరపున పోరాడే ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని రౌడీ రాజ్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నవారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు రాసిన బహిరంగ లేఖ ద్వారా నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

Nara Lokesh Padayatra : పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేశ్ .. తిరుమలతో పాటు సర్వమత ప్రార్థనలతో బిజీ బిజీ

పాదయాత్రకు బయలుదేరుతున్న నారా లోకేశ్  జనవరి 25 హైదరాబాద్ లోని తన నివాసం నుంచి 1.45గంటలకు బయలుదేరి తాత ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించి అనంతరం సాయంత్రం హైదరాబాద్ నుంచి కడప చేరుకోనున్నారు. కడపలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేయనున్నారు. ఆ తరువాత సాయంత్రం 6.30గంటలకు కడప రోమన్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

Nara Lokesh Padayatra : లోకేశ్ యువగళం పాదయాత్ర.. పోలీసులు పెట్టిన 15 కండిషన్లు ఇవే

 



Community-verified icon