Nara Lokesh Padayatra : పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేశ్ .. తిరుమలతో పాటు సర్వమత ప్రార్థనలతో బిజీ బిజీ

పాదయాత్రకు సిద్ధమవుతున్న నారా లోకేశ్ .. తిరుమలతో పాటు సర్వమత ప్రార్థనలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈరోజు నుంచి పాదయాత్ర ప్రారంభమయ్యే సమయం వరకు పలు దేవాలయాలు,ప్రార్థనాల మందిరాలను దర్శించుకుని పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం 400రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించనున్నారు.

Nara Lokesh Padayatra : పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేశ్ .. తిరుమలతో పాటు సర్వమత ప్రార్థనలతో బిజీ బిజీ

Nara lokesh padayatra

Nara Lokesh Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఇక కౌంట్ డౌన్ మొదలైంది. పాదయాత్రకు సిద్ధమవుతున్నారు లోకేశ్. ఇప్పటికే దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసింది టీడీపీ. సభలు,సమావేశాలు రోజుకు ఎన్ని గంటలు నడవాలి?ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించాలి అనేదానిపై రూట్ మ్యాప్ రెడీగా ఉంది. 400రోజులు 4,000 కిలోమీటర్లు నడవనున్నారు లోకేశ్. ఈక్రమంలో నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమువుతున్న క్రమంలో ఎటువంటి ఆటంకాలు కలుగకూడదని సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు.

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభం

దీంట్లో భాగంగా లోకేశ్ ఈరోజు అంటే జనవరి 25 హైదరాబాద్ లోని తన నివాసం నుంచి 1.45గంటలకు బయలుదేరి తాత ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ నుంచి కడప చేరుకోనున్నారు. కడపలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేయనున్నారు. ఆ తరువాత సాయంత్రం 6.30గంటలకు కడప రోమన్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

Nara Lokesh Padayatra : లోకేశ్ యువగళం పాదయాత్ర.. పోలీసులు పెట్టిన 15 కండిషన్లు ఇవే

ఆ తరువాత రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని రాత్రికి అక్కడే బస చేసి మరునాడు అంటే గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడ్ని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం పూర్తి అయ్యాక తిరుమల నుంచి మ.2.30గంటకు కుప్పం చేరుకుంటారు.కుప్పం నియోజక వర్గంలోని వరదరాజస్వామి దేవాలయం వద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అలా ప్రారంభమైన పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలోనే మూడు రోజుల పాటు జరగనుంది. అలా 4 వందల రోజులు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు నారా లోకేశ్. ఈ 4 వందల రోజులు ప్రజలతో మమేకం కానున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.